27.7 C
Hyderabad
March 29, 2024 04: 45 AM
Slider నిజామాబాద్

పుల్కల్ వాజిద్ నగర్ పాఠశాలల్లో కరోనా వైరస్ పై అవగాహన

bichkunda carona 14

కామారెడ్డి  జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు బాన్స్ వాడ డివిజన్ పరిధిలో ని పాఠశాల  హాస్టల్లో కరోనా(కోవిడ్-19) వైరస్ వ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఆరోగ్య బోధకులు దస్థిరాం,  ఇంతియాజ్ అలీ, సబ్ యూనిట్ ఆఫీసర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

శనివారం నాడు  పుల్కల్ వాజిద్ నగర్ పాఠశాలలో జరిగి అవగాహన సదస్సులలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తలనొప్పి , జ్వరం, దగ్గు, జలుబు , గొంతు నొప్పి, ఛాతి నొప్పి, ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరించారు. చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని, ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని తెలిపారు. నోటి తుంపరులు పడకుండా మాస్క్ ధరించాలి, చల్లని ఆహారం,ఫ్రిజ్ లోని ఆహారం ,ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో,జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు,గొంతు నొప్పి ఉంటే గోరు వెచ్చని నీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించాలి అనే అంశాలను తెలుపుతూ అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుశాల్, ఉపాధ్యాయులు మోహన్ గౌడ్, హెల్త్ సూపర్ వైజర్ అనంతలక్ష్మి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు స్థానిక ఏఎన్ఎం ల తో పాటు ఆశలు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : అల్లం నారాయణ

Satyam NEWS

పార్టీలో చేరనందుకు రేషన్ డీలరైపై వైసీపీ ప్రతాపం

Satyam NEWS

అనంతపురం సబ్ రిజిస్ట్రార్ గా భార్గవ్

Bhavani

Leave a Comment