27.7 C
Hyderabad
April 26, 2024 04: 31 AM
Slider నల్గొండ

రోగులకు మేము ఉన్నామనే భరోసా ఇవ్వండి

#MLASaidireddy

ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది ఇక్కడికి వచ్చే రోగులకు మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం సైదిరెడ్డి  మాట్లాడుతూ నిరుపేదల ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తుందని, వారిపట్ల బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు.

ఆసుపత్రికి వచ్చే వారితో ప్రేమగా,ఆప్యాయంగా పలకరించాలని కోరారు. ప్రజా అవసరాల నిమిత్తం రెండు రోజుల క్రితం అంబులెన్స్ ని ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఉన్నట్లు మంత్రి  దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల మంజూరు అవుతాయని తెలిపారు.

ప్రయివేటు ఆస్పత్రికి ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రిని తీర్చి దిద్దాలని, అందుకోసం అందరం కలిసిగట్టుగా కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో   హుజుర్ నగర్ మున్సిపల్ చైర్పరసన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,ఎంపీపీ గుడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మండల పార్టీ, పట్టణ పార్టీ అధ్యక్షులు చావా వీరభద్రయ్య,

చిట్యాల అమరనాధ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, సోమగాని ప్రదీప్ , హాస్పిటల్ సూపరిండెంట్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కామారెడ్డి లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ప్రారంభించిన కలెక్టర్

Satyam NEWS

బివిఆర్ బ్యానర్ ‘భారీ తారాగణం’ ప్రారంభం!

Sub Editor

ఆమనగల్ పట్టణంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment