24.7 C
Hyderabad
March 29, 2024 07: 23 AM
Slider గుంటూరు

ప్రయివేటు ఆసుపత్రులను తక్షణమే జాతీయం చేయండి

#NavataramParty

ప్రయివేటు హాస్పిటల్స్ ను గవర్నమెంట్ హాస్పిటల్స్ గా మార్చాలని కోరుతూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి  గురువారం లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో నవతరం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతున్నా దేశంలో 130 కోట్ల జనాభాకు కేవలం 23578 ప్రభుత్వ వైద్యశాలలు మాత్రమే ఉన్నాయని అందుకే దేశవ్యాప్తంగా ఉన్న 43487 ప్రయివేటు హాస్పిటల్స్ డాక్టర్లు లక్షలు, కోట్లు సంపాదించుకుని ప్రజలను దోపిడీకి గురిచేసినా ప్రజలు భరించారని అన్నారు.

ఇంతకాలం సంపాదించిన ప్రయివేటు వైద్యులు కరోనా అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం ప్రభుత్వ డాక్టర్లు గా సేవాలందించాలని అదేవిధంగా ప్రయివేటు లాబ్ లు,నర్సులు, బ్లడ్ బ్యాంకులు, సర్జికల్ ఉత్పత్తులు, ఎక్సరే యూనిట్లు, ఎమ్మారై యూనిట్లు అన్నిరకాల ప్రయివేటు వైద్య రంగాన్ని జాతీయం చేసి ప్రభుత్వ వైద్యులు కు,సిబ్బందికి, సేవలకు చెల్లించే వేతనాలు ఇచ్చేలా భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీకి ఆదేశాలను ఇవ్వాలని కోరారు.

ఈ లేఖను  సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారించి దేశంలో కోవిడ్19 పరిస్థితి లో ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. స్పెయిన్ దేశంలో ప్రయివేటు హాస్పిటల్స్ జాతీయం చేసిన విషయం పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసామని తెలిపారు.

దేశంలో మొత్తం130 కోట్ల జనాభాకు కేవలం 69267 హాస్పిటల్స్ ఉన్న దయనీయ పరిస్థితి ఉండటం దేశంలో పాలకుల దౌర్భాగ్య స్తితి తెలియజేస్తుంది అన్నారు.

దేశంలో ప్రతీ మృతదేహానికి ఉచితంగా అంత్యక్రియలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేపట్టేందుకు ఆదేశాలను ఇవ్వాలని లేఖలో సుప్రీంకోర్టు కు విన్నవించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.

Related posts

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి రివార్డులు

Satyam NEWS

రామప్ప కు యునెస్కో గుర్తింపు: ప్రపంచ వారసత్వ హోదా

Satyam NEWS

అంబేద్కర్ ఓపెన్ డిగ్రి నాగర్ కర్నూల్ కోఆర్డినేటర్ గా షేక్ ఖాజబి

Satyam NEWS

Leave a Comment