ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్, ఇప్పుడు సెకండ్ వెవ్ లో ఉన్నదని అందువల్ల కరోనా వైరస్ ను తరిమికొట్టాలని TMRPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రాము మాదిగ అన్నారు.
ఈ రోజు వీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ లో మీసాల రాము మాదిగ దంపతులు కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
ప్రతి ఒక్కరు కరోనా వైరస్ ని తరిమి కొట్టడానికి వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా థర్డ్ వేవ్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు, వారి పిల్లలతో సహా కరోనా వ్యాక్సినేషన్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని మీసాల రాము మాదిగ ప్రజలను కోరారు.