22.2 C
Hyderabad
December 10, 2024 10: 38 AM
Slider విజయనగరం

మహిళా సంరక్షణ పోలీసుల సాయం తీసుకోండి

#vakuljindal

గ్రామాలలో ఉన్న మహిళా పోలీసుల సహయా సహకారాలను నేర దర్యాప్తులో తీసుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శాఖా సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లాలోని రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషను పరిసరాలు, లాకప్ సెల్స్, ప్రాపర్టీ రూంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరిశీలించారు. మహిళా సంరక్షణ పోలీసులు, పోలీసు సిబ్బందితో మమేకమై, వారికి దత్తతగా అప్పగించిన గ్రామాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, భూతగదాలు,  గొడవలు తలెత్తకుండా చూడాలన్నారు.

వివిధ రాజకీయ పార్టీల వైరంలు, పాత నేరస్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల పేర్లు, గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారం సేకరించి, ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. ప్రతీ వారం విధిగా దత్తత గ్రామాల్లో పోలీసులు సందర్శించాలని ఆదేశించారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో డిజిటల్ అరెస్టు, ఇతర సైబరు మోసాల పట్ల అవగాహన కల్పించాలని, ఏదైనా సైబరు మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బంది, మహిళా సంరక్షణ పోలీసులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీసు సిబ్బంది సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలు, విద్యార్దులకు “సంకల్పం” కార్యక్రమంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

దర్యాప్తులో ఉన్న చోరీ కేసులను చేధించుటపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దొంగతనాలకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి, చోరీ సొత్తు రికవరీ చెయ్యాలని ఆర్.ఎ.వలస ఎస్సైని జిల్లా ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాల ఏర్పాటులో స్థానిక వ్యాపారులు, ప్రజలు, ఎంఎస్పీ ల సహకారం తీసుకోవాలన్నారు. రోడ్ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద కాషనరీ బోర్డులను, స్టాపర్స్, లైటింగ్ ఏర్పాటు చేసి, ప్రమాదల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

అనంతరం, స్టేషనులో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులు, వివిధ న్యాయ స్థానాల్లో ట్రయల్స్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సిడీ ఫైల్స్ ను జిల్లా ఎస్పీ పరిశీలించి, కేసుల దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేసారు. స్టేషను పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ఇన్ఫార్మర్ వ్యవస్థను మెరుగుపర్చుకోవాలని, సమాచార సేకరణకు ఎంఎస్పీ, దత్తత గ్రామ పోలీసుల సేవలను సమర్ధవంతంగా వినియోగించు కోవాలన్నారు.

స్టేషన్ రికార్డ్స్, జనరల్ డైరీ, పార్టు 1-5 రికార్డ్స్, హిస్టరీ షీట్స్, ప్రాసెస్ రిజిష్టరు, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, కేడీ చెక్ రిజిష్టరు, క్రైమ్ చార్ట్, క్రైమ్ ఆబ్స్ట్రాక్ట్, బీట్ బుక్స్ లను జిల్లా ఎస్పీ తనిఖీ చేసారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన ఇద్దరు మహిళా సంరక్షణ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించి, బహుమతులను ప్రదానం చేశారు. ఈ వార్షిక తనిఖీల్లో చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సిఐ హెచ్.ఉపేంద్ర రావు, ఎస్బి సిఐ ఏవి లీలారావు, ఆర్.ఎ.వలస ఎస్సై నీలావతి, సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు, మరియు ఇతర పోలీసు అధికారులు,ఎంఎస్పీలు, దత్తత పోలీసులు పాల్గొన్నారు.

Related posts

అన్ని మతాలు ఒకటేనని చాటిచెప్పిన మహానుభావుడు గాంధీజీ

Satyam NEWS

రంజాన్ కు మైనారిటీ హక్కుల సమితి సూచనలు

Satyam NEWS

ప్ర‌భుత్వ భ‌వ‌నాలు పాడు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

Sub Editor

Leave a Comment