31.2 C
Hyderabad
April 19, 2024 06: 44 AM
Slider నల్గొండ

సంస్కృత శ్లోకాలను అలవోకగా చెప్పేస్తున్న చరణ్

#Ram Charan

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందంగా నారపరాజు వెంకట రామ చరణ్ ప్రవర్తిస్తున్నాడు. మహా మహా పండితులకే నోరు తిరగని సంస్కృతం లోని భారవి శ్లోకాలను, పాల్కురికి సోమనాథుడు రచించిన పాషాణ పంచక పద్యాలను అవలీలగా తడుముకోకుండా అతను చెప్పేస్తున్నాడు.

సూర్యాపేట జిల్లా  హుజూర్ నగర్ పట్టణానికి చెందిన నారపరాజు శేషగిరిరావు, శ్రీలత ల ప్రధమ సంతానమైన 12 సంవత్సరాల నారపరాజు వెంకట రామ చరణ్ ఈ ప్రతిభ చూపి పలువురిని ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. పండితులు, పెద్దలు సైతం నారపరాజు వెంకట రామ చరణ్ చదివిన పద్యాలు విని ఆనంద భరితులవుతున్నారు.

ఆంగ్ల మాధ్యమానికి అలవాటుపడిన నేటితరం ఇంత చక్కగా తప్పులు లేకుండా తెలుగు సంస్కృత పద్యాలు చదవటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. పిన్న వయస్కుడైన రామ్ చరణ్ ను అందరూ ఆశీర్వదిస్తున్నారు.

Related posts

కారు, బైక్ డీకొని ఇద్దరు మృతి

Bhavani

గీత వృత్తిలో మరణాల నివారణపై పుస్తకావిష్కరణ

Satyam NEWS

దేశ వ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Satyam NEWS

Leave a Comment