Slider

త్వరలో తల్లికి వందనం, రైతు భరోసా

#Savita

వెనుకబడిన తరగతుల అభ్యున్నతే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని, గతంలో ఎన్నడూ లేనంతగా బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎన్నికల్లో బీసీలకిచ్చిన ప్రతి హామీని నెరవేరేస్తున్నామని, ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ కులాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి సవిత మంగళవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల మేలుకు సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి బీసీ కులాల అభ్యున్నతికి నిధులు కేటాయిస్తూ వస్తున్నారన్నారు. 2024-25 బడ్జెట్లో ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు రూ.39,007 కోట్లు, 2025-26 బడ్జెట్ లో బీసీలకు రూ.48 వేల కోట్లు కేటాయించారన్నారు. ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపట్టారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయా కార్పొరేషన్ల చైర్మన్లకు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.

సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందజేయాల్సిన బాధ్యత మీదేనంటే మంత్రి సవిత స్పష్టంచేశారు.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారన్నారు. ఇసుకతో పాటు మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. త్వరలో తల్లికి వందనం, రైతు భరోసా పథకాలను కూడా అమలు చేయబోతున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేయనున్నామన్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు రూ.20 వేలు అందజేయబోతున్నామన్నారు. చేనేతలకు అందజేసే పథకాలపైనా నేతన్నలకు వివరించాలన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నామన్నారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం మేర సీట్లు కేటాయింపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. నామినేటెడ్, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.

సమస్యల పరిష్కారానికి కృషి

ఈ సందర్భంగా ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు పలు సమస్యలను మంత్రి సవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రమందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన స్థాయిలో సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. మరికొన్ని సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు కేవలం ప్రకటనలకు, వైసీపీ నాయకులకు రాజకీయ ఉపాధి కల్పనకే పరిమితమయ్యాయన్నారు.

సీఎం చంద్రబాబునాయుడు రాకతో బీసీ కార్పొరేషన్లకు పూర్వవైభవం వచ్చిందని మంత్రి సవిత వెల్లడించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నందం అబద్ధయ్య, వీరంకి వెంకట గురుమూర్తి, డూండి రాకేశ్, పి.విజయకుమార్, సదాశివం, ఆర్కే నాయుడు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ సడలింపులు క్షేమమా?

Satyam NEWS

మల్దకల్ తిమ్మప్ప ను దర్శించుకున్న సంపత్ కుమార్

mamatha

అఖిల పక్ష సమావేశం జరపకుండా స్టే ఇవ్వండి

Satyam NEWS
error: Content is protected !!