28.7 C
Hyderabad
April 17, 2024 03: 04 AM
Slider ప్రత్యేకం

ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు

#Tanguturi Prakasham Pantulu

ప్రజా నాయకుడు ఎలా ఉండాలో చెప్పేందుకు నిఖార్సయిన ఆదర్శంగా నిలబడిన వారిలో ప్రథముడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. రజాకార్ల ను సైతం ఒక్కడే వెళ్లి దమ్ముంటే మిలటరీ, పోలీస్ లతో పోరాడండి అమాయక ప్రజలతో కాదు అని చెప్పి వారి సెల్యూట్ అందుకొన్న ధీశాలి, యోధుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు.

 బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురు నిలిచి ఇక్కడ కాల్చండిరా అని గర్జించిన ధీశాలి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి. ఈ మహోన్నతుడు మరణించి నేటికీ 64 సంవత్సరాలు. కోట్ల రూపాయలు ఆస్తి ఆ రోజుల్లో దేశ స్వతంత్ర పోరాటానికి వెచ్చించిన దాత. ముఖ్యమంత్రి గా పనిచేసి చివరి రోజుల్లో పేదరికం అనుభవించారు ఆయన.

నీతికి, నిజాయితీ కి నిలువెత్తు దర్పణం. త్యాగానికి ప్రతిరూపం. నేటి కృష్ణా నది ఆనకట్ట శిధిల అవస్థ లో ఉంటే పునర్ నిర్మించిన ది ఆయనే. అందుకే ఆ ఆనకట్ట కు ప్రకాశం గారి పేరు పెట్టారు. వారి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే వడదెబ్బకు మరణించిన ఇద్దరి కుటుంబంలను పరామర్శించిన ప్రకాశం గారు 85 పైబడిన వయసు లో వడదెబ్బకు గురై మరణించారు.

చివరి నిమిషం వరకు ముదిమి మీద పడినా ప్రజల లోనే ఉన్నారు. ప్రజల కోసమే పోరాడారు, ప్రాకులాడారు ప్రజల గుండెల్లో నిలిచి పోయారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి జాతి తరపున నివాళులు అర్పించండి. సత్యం న్యూస్ వారికి జోహార్ పలుకుతోంది.

Related posts

రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు క్రెడిట్ ఎవరికి దక్కుతుంది?

Satyam NEWS

ఘనంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 52వ జన్మదిన వేడుక

Satyam NEWS

ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తేసిన అధికారులు

Satyam NEWS

Leave a Comment