32.2 C
Hyderabad
March 29, 2024 01: 14 AM
Slider ఆదిలాబాద్

అక్రమ వ్యాపారాలపై ఆసిఫాబాద్ పోలీసు ఉక్కుపాదం

#RamagundamPolice

అక్రమ వ్యాపారాలపై కుమ్రం భీమ్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో జరుగుతున్న తనిఖీలను సంబంధించిన వివరాలను మంగళవారం నాడు రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఎస్ పి వి సత్యనారాయణ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇప్పటి వరకు కాగజ్ నగర్  పట్టణం లో 175 క్వింటాళ్లు, ఆసిఫాబాద్ పట్టణంలో 90 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో కలిపి మొత్తం 554 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తం విలువ 11 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది.

అదే విధంగా పెద్ద మొత్తంలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంపింగ్ లు, ఇసుక ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన 25 ట్రాక్టర్ లను,1 బొలెరో, 1 ఆటో ట్రాలీ మరియు 4 అయిచేర్ వాహనాలు  సీజ్ చేశారు. జిల్లాలో ఎటువంటి అక్రమ వ్యాపారాలు జరిగిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, రాణా ప్రతాప్ కు 9550972074 సెల్ నెంబర్ పై తెలియజేయాలని ప్రజలను రామగుండం పోలీసు కమిషనర్, ఆసిఫాబాద్ జిల్లా ఎస్ పి వి సత్యనారాయణ కోరారు.

జిల్లాలో ఎటువంటి అక్రమ వ్యాపారాలు జరగకుండా చూడడమే తమ లక్ష్యమని తెలిపారు.

Related posts

పాపం…. బ(ది)లి అయిపోయిన గోపాలకృష్ణ ద్వివేదీ

Satyam NEWS

సి.సి. రోడ్లకు నిధులు మంజూరు చేయాలి

Sub Editor

కరోనా వ్యాపిస్తున్నదని అంగీకరించినందుకు ధన్యవాదాలు

Satyam NEWS

Leave a Comment