33.7 C
Hyderabad
February 13, 2025 21: 00 PM
Slider రంగారెడ్డి

నిరంతరంగా పోలీస్ టాస్క్ ఫోర్స్ దాడులు

#vikarabad

అక్రమ రవాణాల పైన జిల్లాలో నిరంతరంగా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు నిర్వహించడం జరుగుతుంది అని వికారాబాద్ జిల్లా ఎస్పీ  తెలిపారు. జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలోని యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు చేసి 4 ఇసుక ట్రాక్టర్ లు, ఒక కలప ట్రాక్టర్ ను పట్టుకొని సిజ్ చేయడం జరిగింది అని ఎస్పీ తెలిపారు. ఇట్టి వివరాలు టాస్క్ ఫోర్స్ బృందం యాలాల్ PS పరిధిలోని రస్నాం గ్రామ శివార్లలో అనుమతి లేకుండా కలప రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ని మరియు విశ్వనాధ్ పూర్ గ్రామ శివారులో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా 4 ఇసుక ట్రాక్టర్ లను కూడా పట్టుకొని సిజ్ చేసి యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగిన, అక్రమ రవాణాలు జరిగిన వెంటనే టాస్క్ ఫోర్స్ అధికారులకు సంప్రదించాలని జిల్లా ఎస్పీ  తెలియజేయడం జరిగింది.

Related posts

మా పార్టీ ప్లీనరీ అట్టర్ ఫ్లాప్: రఘురామ వ్యాఖ్య

Satyam NEWS

భారత్ పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందా?

Satyam NEWS

ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 23న కలెక్టరేట్ ముట్టడి

Satyam NEWS

Leave a Comment