34.2 C
Hyderabad
May 19, 2025 17: 39 PM
Slider మహబూబ్ నగర్

ఆస్తిపన్ను బకాయిలపై కొల్లాపూర్ మునిసిపాలిటీ ఆఫర్

#Kollapur Municipality

కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 90 శాతం వడ్డీ రాయితీ కల్పించిందని మున్సిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి చంద్రశేఖర్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీతో ఆస్తి పన్ను చెల్లించవచ్చునని ఆమె తెలిపారు.

ఆస్తి పన్ను బకాయిలు చెల్లించే వారిని ప్రోత్సహించడానికి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలు మొత్తాన్ని వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఈ మేరకు జూలై 28న జీవో నెంబర్ 306 ద్వారా బకాయి ఉన్న ఆస్తిపన్ను పై 90 శాతం వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసిందని ఆమె తెలిపారు. ఈ వెసులుబాటు సెప్టెంబర్ 15  వరకు ఉంటుందని ఆమె తెలిపారు.

Related posts

అందాల శ్రీమతులు ఫ్యాషన్ హుందాలు

Satyam NEWS

వందల కోట్ల మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రా ఎండీ అరెస్ట్

mamatha

జె టాక్స్ అంటూ వై ఎస్ జగన్ ను విమర్శించవద్దు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!