31.2 C
Hyderabad
April 19, 2024 03: 39 AM
Slider ముఖ్యంశాలు

టాక్స్ ట్రాప్ : విల విలలాడుతున్న పెద్ద చేపను కాపాడే యత్నం

tax trap

కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజకీయ విరాళాలు అందచేసిన ఒక కంపెనీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న ఈ కంపెనీ అధినేతకు కేసుల భయం పట్టుకున్నది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఆ కంపెనీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెగ్యులర్ గా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ దాడుల్లో మైనర్ తప్పులు కాకుండా ‘మెగా’ తప్పులు బయటపడటంతో మరింత లోతుగా ఆదాయపు పన్ను శాఖ విచారణ జరిపింది. అందులో దాదాపు 150 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంపినట్లుగా రూఢి అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీతో బాటు డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, బిఎస్ పి మరి కొన్ని రాజకీయ పార్టీలకు కూడా హైదరాబాద్ నుంచి విరాళాలు రూటవుట్ అయ్యాయి.

దాంతో బిజెపి ప్రభుత్వం ఈ వివరాలపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. ఇప్పుడు ఆ కంపెనీ అధినేతకు అరెస్టు భయం పట్టుకున్నది. ఆ కంపెనీ అధినేత అరెస్టు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ఎత్తున చేపట్టిన పెద్ద ప్రాజెక్టులకు ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తున్నది. అందుకే రెండు రాష్ట్రాలకు చెందిన అగ్ర నాయకులు ఇద్దరు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్దకు రాయబారానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.

అయితే ఇది ముందే పసిగట్టిన కేంద్ర మంత్రి వారికి అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఢిల్లీ రాజకీయ వర్గాలు తెలిపాయి. ఈ వివరాలన్నీ అధికారికంగా బయటకు రావాలంటే మరి కొద్దికాలం ఆగక తప్పదు.

Related posts

తెలంగాణ వ్యవసాయ విధానం దేశంలోనే నెంబర్ వన్

Satyam NEWS

కెసిఆర్ రాజకీయ చరిత్రలో అతిపెద్ద మోసం ఇది

Satyam NEWS

ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు VRO వెంకట రమణారెడ్డి

Satyam NEWS

Leave a Comment