28.7 C
Hyderabad
April 25, 2024 03: 53 AM
Slider నల్గొండ

క్షయ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

#Medical

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో క్షయ నిర్ధారణ పరీక్షల శిభిరాన్ని గ్రామ సర్పంచ్ షేక్ సలీమా ప్రారంభించారు.

ఈ సందర్బంగా మండల వైద్యాధికారి Dr. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో రెండు వారాలకు మించి దగ్గు,జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలున్న వారు వెంటనే ఆరోగ్య కేంద్రానికి  రావాలన్నారు.

అలాంటి వారికి క్షయ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తామని అన్నారు. చికిత్స కాలంలో రోగి పోషకాహార నిమిత్తం నెలకు 500 రూపాయలను అందిస్తున్నట్లు తెలిపారు.

T. B. వ్యాధి మందులు వాడనట్లయితే సంవత్సర కాలంలో 12 నుంచి 15 మందికి వ్యాపింపజేసే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా మందులు వాడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో T. B. నోడల్ పర్సన్ ఇందిరాల రామకృష్ణ, వార్డు మెంబర్  అలీ, మమత sts,  అరుణ stls, విజయశ్రీ  ha(f), G. ఉపేందర్  A. ఉపేందర్  L.Ts, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణపై వివక్ష: పార్లమెంటులో పోరాటానికి కేసీఆర్ ఆదేశం

Satyam NEWS

రఘురామతో సయోధ్యకు నలుగురు ఎంపిల రాయబారం?

Satyam NEWS

మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్ సొంతం చేసుకున్న హీరో నాగ చైతన్య

Satyam NEWS

Leave a Comment