32.2 C
Hyderabad
April 20, 2024 20: 43 PM
Slider ప్రత్యేకం

దేశం కోరింది-బిజెపి ఇచ్చింది-ఏమిటి? ఎందుకు??

Amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా కదులుతున్నట్లు ఈ ఒక్క సంఘటన రుజువు చేస్తున్నది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయాలంటే కలిసి పనిచేయక తప్పదని తెలుగుదేశం, బిజెపి నిర్ణయించుకున్నట్లుగా కూడా ఈ సంఘటనతో భావించవచ్చు. చూడటానికి ఎంతో చిన్న అంశంగా కనిపిస్తున్నా కూడా ‘‘ఆంధ్రప్రదేశ్ మ్యాప్’’ విషయం వెనుక పెద్ద ఆలోచనే ఉన్నట్లుగా అనుమానం కలుగుతున్నది.

ఏపీ రాజధానిని పేర్కొనకుండా మ్యాప్ విడుదల చేయడం రాష్ట్ర ప్రజాలను ఆశ్చర్యానికి గురి చేసిందని మొన్న లోకసభ జీరో అవర్ లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. జయదేవ్ లేవనెత్తిన అంశాన్ని కేంద్రం ఇంత సీరియస్ గా తీసుకుంటుందని ఎవరూ అనుకోలేదు. చాలా పెద్ద పెద్ద విషయాలను ఏ మాత్రం పట్టించుకోని బిజపి, లోక్ సభలో తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన ఈ అంశాన్ని ఆగమేఘాలపై పరిష్కరించడం ఏమిటి? గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనిశ్చితి నెలకున్న విషయం తెలిసిందే.

ఏపిలో ఐదు నెలల కిందట ఏర్పడిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని విషయంలో ఊగిసలాట వైఖరిని ప్రదర్శించింది. రాజధాని ప్రాంతం అంతా కృష్ణానది ముంపు ప్రాంతంలోకి వస్తుందని ఇటీవల వరదలు వచ్చినపుడు జరిగిన సంఘటనలు చూపిస్తూ వాదన వెలికి తెచ్చింది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. అధికారికంగా చెప్పలేదు కానీ మునిసిపల్ వ్యవహారాల మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలు చూస్తే అమరావతి నుంచి రాజధానిని తరలించే అంశం పై వేగంగానే పావులు కదిలించారు.

అయితే వచ్చిన ప్రతిఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొద్దిగా నెమ్మదించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పాత రాష్ట్రాన్ని విభజించినందున దేశానికి కొత్త మ్యాప్ అవసరమైంది. ఈ మ్యాప్ ను సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా రూపొందించి విడుదల చేసింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ అధికారికి మ్యాప్ అవుతుంది. ఈ మ్యాప్ లో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వద్ద పాయింటర్ లేదు. అమరావతి అనే ప్రాంతాన్ని కూడా మ్యాప్ లో చూపించలేదు. దాంతో ఒక్క సారిగా అందరిలో ఆశ్చర్యం తొంగి చూసింది.

బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అయితే తెలుగుదేశం పార్టీని లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నిర్వాకం వల్లే రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించలేదని ట్విట్ చేసిన విషయాన్ని సత్యం న్యూస్ ప్రముఖంగా పోస్టు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అంటే ఇసుకపై చేసిన ఉద్యమాలకు రెండు పార్టీలూ ఒకరికొకరు సహరించుకున్నారు. తెలుగుదేశంపార్టీ నుంచి బిజెపిలోకి జెంప్ చేసిన సుజనా చౌదరి ప్రతి వారాంతంలో విజయవాడ వచ్చి క్రమం తప్పకుండా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేయడం కూడా ఆనవాయితీగా మారింది.

ఈ నేపథ్యంలో బిజెపి, తెలుగుదేశం సన్నిహితంగా మెలగడం కూడా ప్రారంభం అయింది. ఈ దశలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు లోక్ సభలో ఏపి మ్యాప్ విషయం ప్రస్తావించారు. కేంద్రం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసేకుంది. ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిని తరలించాలనుకుంటున్న నిర్ణయానికి రెండు పార్టీలూ కలిసి పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేశాయి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఏపి రాజధాని అమరావతి అని ఖరారు చేసేసింది.

ఏపి రాజధాని అమరావతిని మారుస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలిసో తెలియకో అధికారికంగా చెప్పలేకపోయింది. పాలనాపరంగా ఇంకా కుదుటపడని కొత్త ప్రభుత్వానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం షాక్ లాంటిదే. ఇక రాజధానిని మార్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఒక సారి ప్రకటించిన రాజధానిని అధికారికంగా మార్చాలంటే మళ్లీ చాలా తతంగం చేయాల్సి ఉంటుంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నంత కాలం అది కుదిరేపని కాదు. అందువల్ల కొత్త ప్రభుత్వం చచ్చినట్లు ఇక రాజధానిని అమరావతిలోనే కొనసాగించాల్సి ఉంటుంది. తెలుగుదేశం, బిజెపి ద్వయం ఈ విధంగా జగన్ ప్రభుత్వానికి రాజధాని తరలింపు విషయంలో కలిసి చెక్ పెట్టాయి.

Related posts

సూసైడ్ నోట్: భార్యకు మరో వివాహం చేసి సంతోషంగా

Satyam NEWS

మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

కొత్త తరానికి ఆదర్శం అంటే ఇలా ఉండాలి

Satyam NEWS

Leave a Comment