ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు నెలల పాలనలో వైసిపి ప్రభుత్వం సాగిస్తున్న దాడులపై తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసింది. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే కారణమని వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలలో తమపై జరుగుతున్న దాడుల వివరాలను కూడా వారు గవర్నర్ కు అందించారు. టిడిపి నేతలు, కార్యకర్తలు పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు ఫిర్యాదుచేశారు. గవర్నర్ ని కలిసిన వారిలో లో టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, నిమ్మల రామానాయుడు, కరణం బలరాం, అచ్చెం నాయుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య , యలమంచిలి రాజేంద్రప్రసాద్ ఇతర నాయకులు ఉన్నారు.
previous post
next post