39.2 C
Hyderabad
March 29, 2024 14: 31 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

#TDPWanaparthy

వనపర్తిలో 1996 లో అప్పటి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి స్థలాలు ఇప్పించిన వారికి తక్షణమే డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.

పట్టణములోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటిలైన పేద ప్రజలకు సొంత ఇంటి స్థలం ఉండాలని ప్రభుత్వాన్ని ఒప్పించి 312,335 చిట్యాల శివారులో 8 ఎకరాల భూమిని అప్పటిలో ఆయన కొనుగోలు చేసి 60గజాల చొప్పున 223మందికి పట్టాలు ఇప్పించారని తెలుగుదేశం నేత నందిమల్ల అశోక్ తెలిపారు.

వీరందరికి డబల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన అధికారులు, మంత్రి నిరంజన్ రెడ్డి  మాట నిలుపుకోవాలని అయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశములో పట్టాదారులు పాల్గొని పలు తీర్మానాలు చేశారు.

పట్టాలు ఇప్పించిన అప్పటి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. 10 రోజులలో పట్టాదారులకు డబల్ బెడ్ రూమ్ లు కేటాయించకపోతే ఆర్.డి.ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించారు.

చింతల హనుమాన్ దేవాలయములో మంత్రి మాట ఇచ్చిన ప్రకారం మొదట  ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశం నందిమల్ల అశోక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.బాలు, డి.బాలరాజు, కొత్త శంకర్, పట్టదారులు చంద్రయ్య, ఖలీల్, అజయ్, వెంకటస్వామి, బుచ్చన్న మహిళలు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

సో సారీ: ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ లేదు

Satyam NEWS

అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన

Satyam NEWS

నిర్మాతలకు “ప్రొడ్యూసర్ బజార్” ఘన ఆహ్వానం!!

Satyam NEWS

Leave a Comment