31.2 C
Hyderabad
February 11, 2025 19: 49 PM
Slider గుంటూరు

మంత్రి కోడాలి నాని పై చర్యలు తీసుకోవాలి

padmaja arrest

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి కోడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ సరైనవాడైతే చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని గుంటూరు   జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు జివి అంజనేయులు అన్నారు. మంగళవారం మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన యలమంచిలి పద్మజ ను మంత్రి కోడాలి నానిపై చేసిన  వ్యాఖ్యలు గానూ మంగళవారం ఉదయం  కంచకచర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు.

టిడిపి పార్టీ శ్రేణులు పద్మజాకు నైతిక మద్దతుగా అమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా చట్టం అందరికి సమానమే అని , సామాన్యురాలకి ఒకలా, మంత్రి కి ఒకలా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోడాలి నానిపై కేసు నమోదు చేసి జగన్ ప్రభుత్వం వెంటనే నాని ని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

డిమాండ్ చేసిన వారిలో పాలకోల్లు ఎమ్మెల్యే నిమ్మల  రామానాయుడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , మంగళగిరి టిడిపి నాయకులు పోతినేని శ్రీనివాస్, గంజి చిరంజీవి, ఆకుల జయసత్య, నందం అబద్దయ్య, చావాలి ఉల్లయ్య  తదితరులు ఉన్నారు.

Related posts

క్వింటా ఒక్కింటికి 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి

Satyam NEWS

రైల్లోనే తుపాకితో కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలో ట్రాఫిక్ సిబ్బందికే ఝ‌లక్ ఇచ్చిన కేటుగాడు…!

Satyam NEWS

Leave a Comment