30.3 C
Hyderabad
March 15, 2025 12: 02 PM
Slider కృష్ణ

కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ 16 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబు ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు కోడి గుడ్డులు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు అంజి బాబు ప్రోటీన్ ఆహారమైన గుడ్డు, పాలు పంచడం అభినందనీయమని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని వైద్యులు సూచించే సలహాలను పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత ప్రజలందరూ పాటించాలని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజులపాటి ఫణి కుమార్, అరేపల్లి సుబ్బారావు, చాలపాటి శ్రీనివాసరావు, జంపాన తేజా, హనుమాన్ నగర్ యూత్, కాటురు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యలు పరిష్కారం కోసం 30 న చలో తహిశీల్దార్ ఆఫీస్

Satyam NEWS

డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ప్రయత్నం

Satyam NEWS

సంప్రదాయానికి మంచిరోజులు!

Satyam NEWS

Leave a Comment