తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నేత ఎన్. శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. సినీరంగంలోనూ ఆయనకు ప్రవేశంముంది. కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఓవైపు సినిమాల్లో రాణిస్తూనే రాజకీయాల్లోనూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
previous post