37.2 C
Hyderabad
March 29, 2024 20: 29 PM
Slider ప్రత్యేకం

అప్పులే అప్పులు : రివర్స్‌గేర్‌లో రాష్ట్రాభివృద్ధి

#chandrababunaidu

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 20 నెలల్లో రూ.1.70లక్షల కోట్ల అప్పు చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం మాని ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేశారని ఆయన అన్నారు.

టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. ఆదాయానికి మించి అప్పులు చేయడం దివాళా కాకపోతే మరేంటి?  చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.70వేల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయి.

సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారు అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు? 28 మంది వైకాపా ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలి. రెండేళ్లలో ఉద్యోగాలు వచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? కేసుల మాఫీ కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను తాకట్టు పెట్టారు.

నాసిరకం మద్యం ద్వారా రూ.వేల కోట్లు దండుకుంటున్నారు. అసెంబ్లీ పెట్టి కనీసం బడ్జెట్‌ను కూడా ఆమోదింపజేసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత. యువత మేలుకుని భవిష్యత్తు గురించి బాధ్యతతో ఆలోచించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Related posts

దేవినేని ఉమామహేశ్వరరావు తో హీరో నారా రోహిత్ భేటి

Satyam NEWS

మత విభజనతోనే గుజరాత్‌లో బీజేపీ గెలుపు

Murali Krishna

రామతీర్ధం లో రామయ్య పెళ్లికి ఏర్పాట్లు పూర్తి..!

Satyam NEWS

Leave a Comment