విశాఖపట్నం మునిసిపల్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో దసపల్లా ఎగ్జిక్యూటీవ్ కోర్టు హోటల్ లో కూటమి ప్రజాప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు. మేయర్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ ఎం పి ఎం. శ్రీ భరత్, ఎమ్మెల్యే లు వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, కొణతాల రామకృష్ణ, వంశీ కృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, ఎం ఎల్ సి శ్రీ వేపాడ చిరంజీవి, VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, ఎన్ టి ఆర్ వైద్య సేవ చైర్మన్ సుధాకర్, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ కార్పొరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ తదితరులు సమావేశమయ్యారు. జీవీఎంసీ మేయర్ చేజిక్కించు కోవటం కోసం జరిగే ఎన్నిక పై చర్చించారు. ఎం పి, ఎమ్మెల్యే లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. జీవీఎంసీ మేయర్ సాధించేందుకు అవసరమైన బలం ఉన్నందున అవిశ్వాసం నెగ్గేందుకు ఎన్నిక జరిగే రోజు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
previous post
next post