27.7 C
Hyderabad
April 26, 2024 05: 05 AM
Slider గుంటూరు

టీడీపీ లీడర్ డాక్టర్ చదలవాడ అరవిందబాబు అరెస్టు

#chadalawada

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పాలపాడుకు చెందిన టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రంతా వారిని పోలీసులు స్టేషన్ లోనే ఉంచారు. ఇది తెలుసుకున్న చదలవాడ టిడిపి కార్యకర్తలను విడిచి పెట్టాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

అయితే తన వినతికి పోలీసులు స్పందించకపోవడంతో స్టేషన్ ఎదుటనే అరవింద బాబు బైఠాయించారు. డా౹౹ అరవింద బాబు ను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ లోకి పోలీసులు లాక్కొని తీసుకెళ్లారు. ఆయన అరెస్ట్ సందర్భంగా తీవ్ర తోపులాటలు జరిగాయి.

పోలీసుల తీరుపై స్టేషన్ లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. టిడిపి కార్యకర్తలను విడిచి పెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టనని అరవింద బాబు అంటున్నారు. పోలీసు స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్య లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

Related posts

పాకిస్తాన్ పాలకుల ఆలోచనాసరళి మారుతున్నదా?

Satyam NEWS

కల్వకుర్తి లో ఇంటలిజెన్స్ రిపోర్ట్ సర్వే కలకలం

Satyam NEWS

దళితులను మరోసారి మోసం చేసిన కెసిఆర్

Satyam NEWS

Leave a Comment