27.7 C
Hyderabad
April 24, 2024 08: 21 AM
Slider మహబూబ్ నగర్

అయ్యప్పస్వామి మండల పూజకు రావుల సహకారం

#MandalaPuja

ఈ నెల 26న వనపర్తిలో శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి మండల పూజ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి (సీనియర్ న్యాయవాది) 50,000 రూపాయలు వనపర్తి  ఆలయ కమిటీ అధ్యక్షుడు మారం బాలీశ్వరయ్యకు అందజేశారని వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ నేత నందిమల్ల అశోక్ విలేకరులకు తెలిపారు.

అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి ఎం.ల్.ఏ గా ఉన్నపుడు 7,00,000 రూపాయలు రావుల ఇచ్చారని, అదే విధముగా ఆలయ ముఖద్వారానికి వారి అమ్మ  రావుల వెంకటపద్మమ్మ పేరిట 5,00,000 రూపాయలు వెచ్చించి నిర్మించడం జరిగిందని, ప్రతి ఏటా మండల పూజకు రావుల సహకారం అందిస్తున్నారని అశోక్ చెప్పారు.

 గురుస్వాములు, ఆలయ కమిటీ రావులకు కృతజ్ఞతలు తెలియజేసి ఆశీర్వదించారు. డిసెంబర్ 26న ఉదయం 5.15ని. సుప్రభాతసేవ,5.30ని గోమాత పూజ, 6.15ని గణపతి హోమం, 6.45ని మూలమూర్తికి మహాభిషేకం, 7.30ని ధ్వజారోహణం, 8.30ని గణపతి పుణ్యావహాచనం,

9.00గ శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి వారికి 108కళశాలతో మహాభిషేకం,10.00గ పంబా ఆరాట్లు,11.00గ స్వామివారికి సహాశ్ర నామార్చన,11.30ని పల్లకిసేవ, 12.30ని అన్నామయ్యప్ప, 12.40ని. మహామంగలారాతి,1.00 గ. అన్నదానం,6.15 ని. మహాపడిపూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

ఈ పూజా కార్యక్రమాల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి  పాల్గొంటున్నారని, అయ్యప్పస్వాములు, ఆంజనేయ స్వాములు, శివస్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని అశోక్ విజ్ఞప్తి చేశారు. గురుస్వాములు  నందిమల్ల అశోక్,   ముత్తుకృష్ణ, రంగం వెంకటస్వామి, నరేందర్, డి.వెంకటేష్, గోపీనాథ్, ఆలయ అర్చకులు రమేష్ శర్మ  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

రాజకీయ విద్వేషంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Satyam NEWS

మర్కజ్ క్లారిఫికేషన్: కన్ఫ్యూజన్ తప్ప కన్నింగ్ నెస్ లేదు

Satyam NEWS

కరోనా పేరుతో అమరావతి రైతుల శిబిరాలు ఖాళీ

Satyam NEWS

Leave a Comment