ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి లోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉండవల్లి ప్రాంతం, పల్నాడు ప్రాంతంలో భారీస్థాయిలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే చంద్రబాబు ఇంటికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. నారా లోకేష్ సైతం నివాసం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి సిద్ధమవుతున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ని హౌస్ అరెస్ట్ చేశారు. కొద్ది సేపటి క్రితం ఎనికేపాడులోని ఆయన ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత ఆయనను విడుదల చేయడంతో చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ను హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసు శాఖ అప్రమత్తమయ్యింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు చుట్టుముట్టారు. చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు దేవినేని అవినాష్, గంజి చిరంజీవి, చంద్రదండు ప్రకాష్ నాయుడు, జంగాల సాంబశివరావు, కొమ్మారెడ్డి కిరణ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసు స్టేషన్ కు తరలిసున్నారు.
previous post
next post