27.7 C
Hyderabad
June 10, 2023 03: 07 AM
Slider ఆంధ్రప్రదేశ్

బాబు మాటలు అసత్యాల మూటలు

cbn narsireddy

కోడల శివప్రసాదరావును ఒక మహానేతగా అభివర్ణిస్తూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ  క్రియాశీలక సభ్యుడు, సీనియర్ నాయకుడు అన్నపురెడ్డి నర్సిరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితిని పక్కనపెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా దారుణం అనిపించింది అని నర్సిరెడ్డి అన్నారు. కోడెల మరణం వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవలు వాళ్ల ఆస్తి పంపకాలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తి విషయంలో కొడుకు కుమార్తె మధ్య గొడవలు గురించి పల్నాడు ప్రాంతంలో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. పల్నాడు ప్రాంతంలో కోడెల బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని అందులో తమ బంధువులు కూడా ఉన్నారని నర్సిరెడ్డి అన్నారు. కోడెల కుటుంబ సభ్యుల గురించి ఆయన చెప్పిన విషయాలు:

1.కొండమోడు శ్రీకాళహస్తి రైల్వే పనులు చెయ్యకుండా కాంట్రాక్టర్ ను బెదిరించి కమిషన్ ఇవ్వలేద అని కాంట్రాక్టర్ పైన st sc కేసు పెట్టి కమిషన్ తీసుకోవటం లో కోడెల శివరాం ముఖ్య పాత్ర వహించాడు. అలానే వర్కర్స్ షెడ్ లను కూడా తగల పెట్టించాడు.

2. ధూళిపాళ్ల గ్రామంలో 18 ఎకరాల రైతుల భూమిని ఆక్రమించి దానిలో ఉన్న కోళ్ల ఫారలను తగలబెట్టి అక్కడి రైతుల పై దాడి చేసి వారిని తరిమి కొట్టి అక్కడ ఉన్న 18 ఎకరాల్లను అక్రమించారు.

3. రాజు పాలెం గ్రామంలో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగస్తుల ఐదెకరాల్లో ఉన్న నిమ్మ తోటని ప్రోక్లైన్ తో పీకించి శివరాం మనుషులు ఆ పొలాన్ని అక్రమించుకున్నారు.

4.సత్తెనపల్లి మండలనికి సమీపంలో కోడెల కుమార్తె కు చెందిన సేఫ్ మందుల కంపెనీ కి సంబంధించిన మందులను మెడికల్ షాప్ ల వాళ్ళను బెదిరించి టార్గెట్స్ పెట్టి మందులను అమ్మించి ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు తీశారు.

5 సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గాల్లో  సంవత్సరానికి ఒక్కో బ్రాందీ షాప్ కు పాతిక లక్షల నుంచి 50 లక్షల వరకు 5 సంవత్సరాలు కోడెల శివరాం వసూలు చేయడం.

6. సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గాల్లో స్వీట్స్ షాప్ నుంచి గోల్డ్ షాప్ దాకా డైలీ మామూళ్లు వసూలు చేశారు.

7. అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకు వచ్చే భోజనాన్ని తన సేఫ్ కంపెనీలో పనిచేసే తన వర్కర్స్ కు 50 రూపాయలకు అమ్మారు.

8. కోడెల శివ రామ్ కు సంబంధించిన మోటార్ బైక్ షో రూమ్స్ లో ప్రభుత్వానికి లైఫ్ టాక్స్ కట్టకుండా బైకులు అమ్ముకున్నారని ఆ విషయంలోనే శివరాంకు సంబంధించిన బైక్ షోరూంలను సీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

9.రెండు నియోజకవర్గాలలో ప్రభుత్వ కాంట్రాక్టర్స్ దగ్గర అన్ని పనులకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా  10% కమిషన్ తీసుకోవడం నిజం కాదా?

10. రెండు నియోజకవర్గాలలో అపార్ట్మెంట్స్ కట్టాలన్నా ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్నా వారిని బెదిరించి వాటాలు తీసుకున్నది నిజం కాదా?

11.రెండు నియోజకవర్గాల గుండా వెళుతున్న ఇసుక లారీలను అడ్డగించి ఇసుకను ఆన్ లోడ్ చేపించు కోవటం నిజం కాదా?

ఇన్ని అరాచకాలు చేసిన కుంటుంబాన్ని పక్కన పెట్టుకొని  చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం అయన శవ రాజకీయాలు చేయడం చూసి మనసు నొచ్చు కోని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడే నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో పనిచేయటం నావల్ల కాదు అని నిర్ణయం తీసుకొని  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నపురెడ్డి నర్సి రెడ్డి తెలిపారు.

Related posts

అడ‌వుల సంర‌క్ష‌ణ‌తోనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌

Satyam NEWS

మంగళగిరి నృసింహునిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

Satyam NEWS

ఆదర్శ నాయకుడు కమ్యూనిస్టు నేత సున్నం రాజయ్య

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!