కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్…రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తుందని విజయనగరం టీడీపీ నేతలు స్పష్టం చేసారు. విజయనగరం అశోక్ బంగ్లాలో…టీడీపీ రాష్ట్ర నేత ఐవీపీ రాజు,నగర కమిటీ అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, ఆల్తి బంగారు నాయుడు, బొద్దుల నర్సింగరావు, పిళ్లా విజయకుమార్.అవనాపు విజయ్,ముద్దాడ మధు మాట్లాడారు.ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ అమరావతి రాజధానికి 2024-25 బడ్జెట్లో కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయటం సంతోషకరమైన అంశమన్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయుటకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సుముఖత తెలపడం ఇంకా సంతోషమన్నారు., వైజాగ్ చెన్నై ప్రత్యేక కారిడార్ కు నిధులు మంజూరు చేయడం, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం,కేంద్రం నుండి నిధులు విడుదల చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రానికి శుభపరిణామమని అన్నారు.