28.2 C
Hyderabad
December 1, 2023 19: 33 PM
Slider ఆంధ్రప్రదేశ్

పల్నాడులో దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నాడు

N-Chandrababu-naidu

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పరిస్థితులు టీడీపీ హయాంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే అంశం గురించి ఎవరో చెప్పనక్కర్లేదు. ఆ ప్రాంత వాసులకు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు కే ట్యాక్స్ లు లేవు, మైనింగ్ మాఫియా చెలగాటాలు లేవు. ఉన్నంతలో సాత్వికంగా వ్యవహరించే ఎమ్మెల్యేలే అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వీరెవరికి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రముఖులంతా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే. కోడెల శివప్రసాద్ రావు, యరపతినేని శ్రీనివాసరావు.. ఈ రెండు పేర్ల మీద ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, వారి పేర్లతో జరిగి బయటకు వస్తున్న బాగోతాల సంగతి అందరికీ తెలిసిందే. కోడెల పేరుతో దందాలు పల్నాడుతో మొదలుకుని రాయలసీమ వరకూ జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా కోడెల దందాలు వెలుగులోకి వస్తున్న వైనం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. కోడెల కుమారుడు, కుమార్తె ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దందాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్లే గగ్గోలు పెడుతూ ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ హోదాలో కూర్చుని..విలువైన ఫర్నీచర్ ను ఇంటికి తరలించుకువెళ్లిన, తనయుడి ఆఫీసుల్లో వాటిని ఉపయోగించుకుంటున్న కోడెల గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే! ఇక యరపతినేని సంగతి సరేసరి. ఆయన మైనింగ్ మాఫియా గురించి సీబీఐ విచారణకు ఆదేశించాలని స్వయంగా కోర్టే ఆదేశాలు ఇచ్చేంత వరకూ వచ్చింది పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని టీడీపీ నేతలు పరారీల్లో ఉంటున్నారు. తమ పాత బాగోతాలపై ఇప్పుడిప్పుడు విచారణలు మొదలవుతున్న నేపథ్యంలో..ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తుందో అని తెలుగుదేశం పార్టీ నేతలు భయపడుతూ ఉన్నారు. వారి నేతల తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు  ఛలో ఆత్మకూర్ అంటున్నారు. తన పార్టీ వాళ్లు అరెస్టు భయాలతో పరార్ అవుతుంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రహసనానికి తెరతీశారు.

Related posts

ట్రాఫిక్ ఆంక్షలు

Murali Krishna

జస్టిస్ వాంటెడ్: నేతన్నల హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతా

Satyam NEWS

అడ్డగుట్టలో గోడ కూలి ముగ్గురి మృతి

Bhavani

Leave a Comment

error: Content is protected !!