అనంతపురం పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కు తెలుగు దేశం నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు ఎయిర్ పోర్టు లో మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందచేశారు.
ఈ కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ, పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బి.కె పార్థసారథి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మాదినేని ఉమామహేశ్వర నాయుడు, పరిటాల శ్రీరామ్, ఆలం నరసానాయుడు, సవిత, కేశన్న తదితరులు పాల్గొన్నారు.