34.2 C
Hyderabad
April 19, 2024 20: 23 PM
Slider తూర్పుగోదావరి

27, 28న వేమగిరిలో టీడీపీ మహానాడు

#chandrababu

ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ దీనికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది. మహానాడులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే రాజమహేంద్రవరానికి చంద్రబాబు, లోకేశ్ వెళ్తారు.

మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చేలా తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో ఉండనుంది. శుక్రవారం రాజమహేంద్రవరంలో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతోన్న వేళ ఈ సారి మరింత ప్రతిష్టాతక్మంగా మహానాడును నిర్వహిస్తున్నారు. దాదాపు 25 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఏపీకి సంబంధించిన 15, తెలంగాణకు సంబంధించిన 6 తీర్మానాలు ప్రవేశపెడతారు. నాలుగు ఉమ్మడి తీర్మానాలు ఉంటాయి. ఈ నెల 27న ప్రతినిధుల సభలో తీర్మానాలు ప్రవేశపెడతారు. 28న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుంది. మహానాడుకు మొత్తం కలిపి 15 లక్షల మంది సభకు హాజరవుతారని టీడీపీ భావిస్తోంది.

Related posts

గుడ్ న్యూస్: మోడీ స‌ర్కారు సంస్క‌ర‌ణ‌లకు సాహో!

Satyam NEWS

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన పసుపులేటి పవన్

Satyam NEWS

బాసరలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Satyam NEWS

Leave a Comment