ఈ నెల 23న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నేడు ఎజెండా ఖరారు చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షలు జీ.వి ఆంజనేయులు అధ్యక్షతన వహించారు.
పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం చేయడం తదితర అంశాలపై వారు చర్చించారు. రాష్ట్రంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు.