29.2 C
Hyderabad
September 10, 2024 16: 44 PM
Slider ప్రత్యేకం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీపై టీడీపీ కన్ను

#vizag

గతం లో కడప లో బిటెక్ రవి ని ఎమ్మెల్సీ గా ఎలా గెలిపించుకున్నామో అదే తరహా లో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని గెలుచుకోవాలని టీడీపీ ప్రణాళిక రచిస్తున్నది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే వైకాపా అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మరో పక్కా కూటమి టీడీపీ అభ్యర్థిగా గండి బాబ్జి పేరు పరిశీలిస్తుంది. విశాఖ దక్షిణ టికెట్ జనసేన కేటాయించడం తో ఆనాడు గండి బాబ్జి కి టీడీపీ అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. దానిలో భాగంగా గండి బాబ్జి కి ఎమ్మెల్సీ  టికెట్ దక్కే అవకాశం ఉంది.

విశాఖ ఎమ్మెల్సీ కి స్థానిక బలం వైకాపా కే ఎక్కువ ఉంది. దాదాపు 800 ఓట్లు ఉండగా టీడీపీ కి 300 లోపే ఉన్నాయి. టీడీపీ విజయానికి 650 ఓట్లు కావాలి. ఇప్పటికే కొంత మంది కార్పొరేటర్లు వైకాపా ని వీడి టీడీపీ లో చేరారు. మరి కొంత మంది జనసేన లో చేరారు. అలాగే ఎంపిటిసి, జడ్ పి టి సి, వార్డు సభ్యులు పెద్ద స్థాయి లో 100 మందికి పైగా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీనితో వైకాపా బలం 700 కి టీడీపీ కి 400 చేరింది. మరో 200 టు 300 మంది కూటమి లో చేరితే కూటమి కి ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంది.

దానిలో భాగంగా విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు వలసలను ప్రోత్సహిస్తున్నారు. చడీ చప్పుడు కాకుండా వలసలను ఆహ్వానిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఎమ్మెల్సీ స్థానం చేజారిపోకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి అని, వైకాపా కి గట్టి దెబ్బ కొట్టాలని కూటమి భావిస్తుంది. కూటమి విజయం సాధించాల్సిన బాధ్యతలను సీనియర్ నాయకులకు టీడీపీ అధిష్టానం అప్పగించింది.

పూడి రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, విశాఖపట్నం

Related posts

ఉత్తరాంధ్ర కల్పవల్లి పండుగ బందోబస్తు పై డీఐజీ ప్రత్యేక దృష్టి

Satyam NEWS

శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలకు కేసీఆర్ కు ఆహ్వానం

Satyam NEWS

వందలాది కొంపలు ముంచిన వీధినాటకం

Satyam NEWS

Leave a Comment