30.7 C
Hyderabad
April 17, 2024 02: 37 AM
ముఖ్యంశాలు

రాష్ట్రంలో పెద్ద దొంగ, ఉత్తరాంధ్రలో చిన్న దొంగ పాలిస్తున్నారు

#AshokGajapathiRaju

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌ఖ్యాతి గాంచిన రామ‌తీర్దం కొండ‌పై రాముని శిర‌స్సు తొల‌గించ‌డంపై ప్ర‌తిప‌క్ష  టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసింది. ఈ మేర‌కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌పతిరాజు బంగ్లాలో ఉన్న టీడీపీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆ పార్టీ నేత‌లు అశోక్ గ‌జ‌ప‌తి రాజు అయ్య‌న్న‌పాత్రుడులు త‌దిత‌రులు మాట్లాడారు.

ముందుగా మాజీ మంత్రి అయ్య‌న్నపాత్రుడు మాట్లాడుతూ…రాష్ట్రంలో పెద్ద దొంగ, ఉత్తరాంధ్రలో చిన్న దొంగ పాలిస్తున్నారని… ఇది రాష్ట్ర‌ ప్రజల దౌర్భాగ్యమని విమ‌ర్శించారు.ఇక సంఘ‌ట‌న జ‌రిగిన మ‌ర్నాడే జిల్లాకు వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ క‌నీసం రామ‌తీర్ధం ఘ‌ట‌నపై మాట్లాడ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

గ‌డ‌చిన రెండేళ్ల‌లోనే రాష్ట్రంలో 125 దాడులు దేవలయాలపై జ‌రిగాయ‌ని..కేవలం హిందూ దేవాల‌యాల‌పైనే ఈ దాడులు జ‌రుగుతున్నాయ‌న్నారు. అన్ని మ‌తాల‌ను స‌మానంగా చూడాల్సిన బాధ్య‌త రాష్ట్ర సీఎంపై ఉంద‌న్నారు. ఇక మ‌తం అంటూ కాషాయ‌జెండా ప‌ట్టుకుని పూసుకు తిరిగే బీజీపీ జ‌రిగిన దాడుల‌పై నోరెందుకు మెద‌ప‌డం లేద‌న్నారు.

అనంత‌రం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు మాట్లాడుతూ…. రాష్ట్రంలో హిందూ మతంపైనే ఎక్కువ‌గా  దాడులు జరుగుతున్నాయ‌ని…అన్ని మతాలను మనం గౌరవించే ప‌రిస్థితి రాష్ట్రంలో కనిపించ‌డం లేద‌న్నారు.

నిన్న అంత‌ర్వేది..తాజాగా రామ‌తీర్ధం ఘ‌ట‌న‌…400 ఏళ్ల‌ పుణ్యక్షేత్రం…ఎంతో పవిత్రమైన స్థలం….దేవాల‌యంపైనే దాడి జ‌రగ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

ఈ ముఖ్య‌మంత్రికి పాల‌న చేత‌కాద‌ని.., ఎవ్వరి మాటా వినకుండా ఏకపక్షంగా వెళ్తున్న ఈయనకు సలహాదారులు ఎందుకు అంటూ టీడీపీ సీనియ‌ర్ నేత‌లు ప్ర‌శ్నించారు.బెయిలు పై వచ్చి నీతులు చెబుతున్న సీఎంను భరించాల్సిన దౌ ర్భాగ్యము రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింద‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.ఈ మీడియా స‌మావేశంలో పార్టీ నేత‌లైన ఆధిత రాజు, విజ్జ‌పు ప్ర‌సాద్,త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ఫ్యాక్ట్ ఫైండింగ్: అసత్య ప్రచారాలే ఢిల్లీ అల్లర్లకు కారణం

Satyam NEWS

డేంజర్ బెల్స్: దేశంలోకి వచ్చేసిన కరోనా వైరెస్

Satyam NEWS

సిఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

Satyam NEWS

Leave a Comment