Slider విశాఖపట్నం

కూటమి ప్రభుత్వానికి జై కొట్టిన వైసీపీ

#YCP

విశాఖ లో వైసీపీ నిర్వహించిన యువత పోరు లో ఆసక్తికర సంఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ వైకాపా యువత నాయకులు నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పిలుపునిచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా స్పందన కనిపించలేదు. బలవంతంగా రోడ్ల మీదకు తీసుకువచ్చేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత 9 నెలలు గా విద్యా వ్యవస్థ ను మంత్రి నారా లోకేష్ ప్రక్షాళన చేస్తున్న తీరు చూసి కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ వైకాపా నాయకులు మనస్సులో మాట బయట పెట్టారు.

జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రూ. 4,600 కోట్లు విద్యావ్యవస్థకు సంబంధించిన బకాయిలు పెట్టాడు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో గుర్తుకు రాని రీయింబర్స్‌మెంటు, వసతి దీవెన జగన్‌కు ప్రతిపక్షంలో ఉండగా గుర్తొచ్చిందా? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నది. గతంలో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పధకాన్ని సృష్టించినట్లు  సిగ్గులేకుండా జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడని వారు విమర్శించారు. గతంలో విద్యార్ధుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం  అందజేసింది.

కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రచార్బాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్ధుల్ని, వారి తల్లితండ్రుల్ని మోసం చేశాడు. ఆ ఇచ్చేది కూడా పోనీ సకాలంలో ఇచ్చాడా అంటే ఎప్పుడు ఖాతాలో ఎప్పుడు వేసేవాడో తెలియదు.  కళాశాల యాజమన్యాలు విద్యార్ధుల్ని వేధించాయి. కొన్ని చోట్ల హాల్ టిక్కెట్లు నిలిపివేసి,  పరీక్షలు రాయనీయ్యమంటూ  విద్యార్దుల్ని ఇబ్బందులకు గురి చేశాయి. దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడాడు, బకాయిల కుప్ప పెట్టి పోయాడు అంటూ తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి అది కూడా విడతల వారీగా ఇచ్చి, దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్ధులను మోసగించారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వలన డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌, ట్రిపుల్‌ ఐటీ, ఇతర కోర్సులు పూర్తి చేసిన ఉన్నత విద్య చదివే అవకాశం లేక పలువురు, ఉద్యోగావకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు సతమతమయ్యారు.

జగన్ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి… ఒకటో పట్టణ పోలీస్  స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. 2021-22 4వ క్వార్టర్‌ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి కాలేజీ యాజమాన్యం తాఖీదు ఇచ్చింది లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది.

చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం రీయింబర్స్‌ మెంట్‌ నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన రూ.57 వేల ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్‌ నోటీసు అందింది. డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది  ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్ధులను నర్సింగ్ కళాశాల బయటకు పంపేసింది. ఇవ్వని ఫీజులకు కూడా పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకున్నారని తెలుగుదేశం విమర్శించింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ -​రూ.2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు – ​రూ.989 కోట్లు బకాయిలను జగన్ రెడ్డి పెట్టారని అంటున్నారు. 5 ఏళ్లకు ఏడాదికి  4 విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే రూ.4,271 కోట్ల బకాయిలు పెట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది. వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నది.

విద్యార్థులను ఫీజు కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కాలేజీలకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 2024 జనవరిలో విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలని జగన్ ఇవ్వకుండా ఎగ్గొడితే.. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, ఆ బకాయిలని విడుదల చేస్తూ, విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.

Related posts

కొల్లాపూర్ ప్రచార సరళిపై కేటీఆర్ అసంతృప్తి

Satyam NEWS

196 ల‌క్ష‌ల వ్య‌యంతో  విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద వాట‌ర్ ట్యాంక్

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వారితో జరభద్రం…!

Satyam NEWS

Leave a Comment