31.7 C
Hyderabad
April 19, 2024 00: 40 AM
Slider కడప

జీవో కాపీలను భోగిమంటల్లో కాల్చి టీడీపీ నిరసన

#kadapatdp

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన, అందుకు అనుగుణంగా విడుదల చేసిన జీవోలను తెలుగుదేశం పార్టీ భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి నిరసన తెలిపింది. కడప జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో 19, 68, 204  జీఓ కాపీలను భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా భత్యాల మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన  జీవో కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేశామని, ప్రజా వ్యతిరేక పాలన ప్రభుత్వానికి మంచిది కాదని ఇలాంటి వాటి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు.

తుగ్లక్ ప్రభుత్వం పిచ్చి జీవోలను విడుదల చేసి ప్రజలపై అదనపు భారం మోపి ఒ.టి.యస్ పేరుతో 10000 వేలు, రాష్ట్రంలో చెస్ ద్వారా వచ్చే ఆదాయంతో రోడ్లను అభిరుద్ధి చేస్తామని చెప్పి దేశంలోనే పెట్రోల్ ధరలు అధికంగా పెంచారని ఆరోపించారు.

రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు ధరలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే ఈ వైసిపి ప్రభుత్వంలో ఆకాశాన్ని అంటాయనీ,ఆ కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు నిత్యవసర వస్తువుల కొనలేని దుర్బర పరిస్ధితులను ఎదుర్కుంటూ సంక్రాంతి పండగకు కూడా దూరంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి కడవకూటి తిరుపతయ్య, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రమణ్యం నాయుడు, తెలుగుయువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గుండు సురేష్, నందలూరు సర్పంచ్ మొడపోతుల రాము, మదన్మోహన్ పురం సర్పంచ్ చుక్కా యానాది, పసుపులేటి ప్రవీణ్, చామాంచి పెంచలయ్య, నాగిరెడ్డి గ్రామకమిటీ పార్టీ అధ్యక్షుడు గంథంశెట్టి గంగాధర్, షర్మిళ,శివ,తోటకృష్ణయ్య,హరి, మీసాలశ్రీను,జయసింహ,కుమార్,కొండయ్య, నర్సయ్య,మదన్మోహన్ పురం గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్,నాగర్జున, జ్యోతి శివ,తోట ప్రసాద్, శ్రీను, కేత నరసింహ, జిలకర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి ఆధ్వర్యంలో రాజంపేట అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులు

Satyam NEWS

కనక దుర్గ అమ్మవారిని దర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

లాక్ డౌన్: నిరుపేదలెవరూ ఆకలితో అలమటించవద్దు

Satyam NEWS

Leave a Comment