30.3 C
Hyderabad
March 15, 2025 10: 46 AM
Slider కృష్ణ

కిమ్ పాలన గుర్తు చేస్తున్న వై ఎస్ జగన్

#TDP Vijayawada

లాక్ డౌన్ లో ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచిందని టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విజయవాడలోని కేశినేని భవన్ లో ఆమె దీక్ష చేపట్టారు. ఉదయం 7 లకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 7 గంటల వరకు సాగుతుంది. కేశినేని శ్వేత దీక్షకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మద్దతు తెలిపారు.

లాక్ డౌన్ పీరియడ్ లో ఎక్కువ వచ్చిన కరెంట్ బిల్లులని మాఫీ చేయాలని, కరెంట్ బిల్లుల పెంపులో కూడా దొంగ లెక్కలు చెప్తున్నారని ఆమె అన్నారు. ఎక్కడైనా ముందు బాధితుల్ని పరామర్శించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారని అయితే విశాఖ విషవాయువు లీక్ కేసులో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు బాధ్యులను కలిసి తర్వాత బాధితుల్ని పరామర్శించారని అన్నారు. సౌత్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనను జగన్ గుర్తు చేస్తున్నారని ఆమె అన్నారు.

Related posts

బ్రహ్మంగారి గుడిని సందర్శించిన పీఠాధిపతి వెంకటాద్రి స్వామి

mamatha

విశాఖ నగరంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య

Satyam NEWS

రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment