28.7 C
Hyderabad
April 20, 2024 07: 07 AM
Slider నెల్లూరు

దొడ్డిదారిన కరెంటు చార్జీలు పెంచి బుకాయిస్తారా?

#TDP Nellore

దొడ్డి దారిన కరెంట్ చార్జీలు పెంచి కూడా లోక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉన్నందున బిల్లులు ఎక్కువ వచ్చాయని మంత్రులు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి విమర్శించారు.

లోక్ డౌన్ వలన నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవడానికి కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ లో భాగంగా విద్యుత్ రంగంలో డిస్కం లకు 90 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల నుండి 3 నెలల కరెంట్ బిల్లులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు లాక్ డౌన్ నిబంధనలకు లోబడి కోవూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెనుమల్లి శ్రీహరి రెడ్డి నివాసములో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష ను ప్రారంభించిన అనంతరం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో కరెంట్ చార్జీలు పెంచమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

విద్యుత్ చార్జీలపై మాటతప్పిన ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన వేదికపై నుండి కరెంట్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి నేడు కరెంట్ చార్జీలు పెంచారని, మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం అని చెప్పి కరెంట్ చార్జీలు  విషయంలో మాట తప్పారని ఆయన అన్నారు.

గతం లో జిరో బిల్లులు వస్తున్న ఎస్సీ,ఎస్టీ వినియోగదారుల కు నేడు వేలల్లో బిల్లులు వస్తున్నాయని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలు భారాలు మోపారని ఆయన అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలను అడుకోవడములో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు.

ఇప్పటికయినా ప్రభుత్వం స్పందించి పెంచిన కరెంటు చార్జీలు తగ్గించడము తో పాటు 3 నెలల విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈ నిరాహారదీక్ష శిబిరంలో పెనుమల్లి శ్రీహరి రెడ్డి తో పాటు,మన్నెపల్లి నాగేంద్ర,ఇంటూరు విజయ్,సుప్రజ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య,జొన్నదుల రవికుమార్, సాయి రోశయ్య,శ్యాం,ప్రదీప్ సురేష్,రంగారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

Related posts

అమరావతి రైతుల డిమాండ్ ను అపహాస్యం చేసిన సీఎం జగన్

Satyam NEWS

రూ.2426.39 కోట్లు తో వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో టెక్నాలజీ అభివృద్ధి

Satyam NEWS

‘స్పందన’దృశ్య శ్రవ్య సంచికల ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment