37.2 C
Hyderabad
March 29, 2024 18: 33 PM
Slider గుంటూరు

పాలన చేతగాని అసమర్థ సీఎం వై ఎస్ జగన్: చదలవాడ విమర్శ

#dr chadalawada

ప్రజలపై చెత్త పన్ను, డ్రైనేజ్, నీటి పన్ను ఇతరత్రా పన్నులతో ముఖ్యమంత్రి ప్రజలను హింసించే రాజులా మారిపోయాడని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పెరుగుతున్న నిత్యావసరాలు ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించింది.

ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ జగన్ అన్న దెబ్బకు పేదలు, మధ్యతరగతి వారు ఇళ్లు అమ్ముకుంటున్నారని డా౹౹చదలవాడ అన్నారు.  దేశంలో లో ఏ ముఖ్యమంత్రి అయినా చెత్త పై పన్ను వేశాడా? కానీ అవగాహన లేని అవినీతి ముఖ్యమంత్రి వేశాడు. చెత్త పై పన్ను తో పాటు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారుల పై కూడా పన్నులు వేశాడు. వైకాపా ప్రభుత్వం ధరలను అదుపు చేయలేక పోతున్నారు. మహిళలపై ఆర్థిక భారం మోపుతున్నారని డా౹౹చదలవాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.500 ఉండేదని రూ.150 వరకు రాయితీ వచ్చేదన్నారు. వైకాపా ప్రభుత్వంలో రూ.870 ఉంటే,రూ.16 మాత్రమే రాయితీ వస్తుందని పేర్కొన్నారు.

బియ్యం పప్పు ఉప్పు ఉల్లిపాయలు నూనె వంటి ఇతర సరుకులు ధరలు రెట్టింపయ్యాయి అన్నారు. నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని రేషన్ డిపోల ద్వారా నాణ్యమైన 14 రకాల సరుకులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక, సిమెంట్ నిత్యవసర వస్తువుల ధరలు, సంపూర్ణ మద్యనిషేధం అన్నారు. కానీ ఈ మద్యం ధరలు పెంచారు.

రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు కానీ స్పెషల్ బ్రాండ్ ఇచ్చారు. సామాన్యులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యావసరాలు పెట్రోల్ డీజిల్ విద్యుత్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి ఇ పేదలు మధ్యతరగతి వారికి ఏదో చేస్తున్నట్లుగా వారిని నమ్మిస్తూ రాష్ట్రం చేసిన అప్పుల భారాన్ని కూడా పేదలపై వేసి ఆయా వర్గాలు కోలుకోలేని విధంగా చేశాడని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి విశ్వరరావు, రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు వెన్న బాలకోటి రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి, పార్లమెంట్ కార్యదర్శులు గొట్టిపాటి జనార్ధన్ బాబు, మొండితోక రామారావు, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, అల్లంశెట్టి మోహన్రావు,రాపర్ల జగ్గారావు,పట్టాణ ప్రధాన కార్యదర్శి శేఖర్, మండల తెలుగు యువత అధ్యక్షుడు యంపరాల ఖాసీం,టిడిపి సీనియర్ నాయకులు కొల్లి వెంకటేశ్వర్లు,

ఇమ్మడిశెట్టి కాశయ్య,అబ్బూరి శ్రీను, పులికురి జగ్గయ్య,యార్లగడ్డ లింగయ్య,కోనేటి శ్రీను,కొల్లి బ్రహ్మయ్య,పూదోట సునీల్,మందలపు వెంకట్ రత్నం, యాడ్స్ వాలి, వందనా దేవి,మానుకొండ జాహ్నవి, కదం నాగజ్యోతి, గంగినేని లీలావతి,బడే బాబు, కొల్లి ఆంజనేయులు,దండ శివ రామకృష్ణ, పెరికల రాయప్ప,కోట ప్రసాద్,చంద్రమౌళి, కాల్వ చిన్న,మబు,సుభాని,మేకల సైదారవు, శాఖమూరి మారుతీ,మొహమ్మద్ రఫీ,నవీన్,హుస్సేన్,చల్లగుండ్ల హరి కృష్ణ,కోట సుధీర్,వీరయ్య,సాధినేని అంకమ్మ రావు,మతంగి బంగారం,ముండ్రు శివ కోటేశ్వరరావు,కరిముల్లా,నగుర్ ఖాళిల్,ఉప్పుటూరి అనిల్, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రమేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్

Related posts

న్యూ ఫైండింగ్: ఢిల్లీ అల్లర్ల వెనుక ఉగ్రవాదుల హస్తం

Satyam NEWS

కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆంక్షలు

Satyam NEWS

పాము కాటు చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించిన కలెక్టర్

Satyam NEWS

Leave a Comment