37.2 C
Hyderabad
April 19, 2024 12: 42 PM
Slider ప్రకాశం

గౌరవ సభ కాదు కౌరవ సభ: విమర్శించిన తెలుగు మహిళలు

#Telugumahila

దేవాలయం లాంటి చట్టసభలో మహిళను అవమానించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో శింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం ఎదుట నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటు తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు నాగబోతు సుజాత మాట్లాడుతూ కౌరవులు ఎలా రాజ్యాన్ని కోల్పోయారో అదే విధంగా వైసీపీ కూడా మట్టి కరవడం ఖాయమని అన్నారు. నారా భువనేశ్వరి పై వైసీపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆడవారిపై వారి పార్టీకి ఉన్న ఉన్న అభిప్రాయం ఏపాటిదో అర్దమవుతోందని అన్నారు.

తుఫాన్ బాధితులకు ప్రభుత్వం కంటే ముందుగా  స్పందించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించిన ఆదర్శ మహిళ భువనేశ్వరి అని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం సైకో ప్రభుత్వ మనిచెప్పడానికి మహిళలపై జరుగుతున్న దాడులే నిదర్శనమని అన్నారు.

అద్దంకి నియోజవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నంగి మనోహరమ్మ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడి హేయమన్నారు. నందమూరి, నారా కుటుంబాలు  క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.

ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో  జోక్యం చేసుకోలేదు… గడప దాటలేదని అన్నారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదని అన్నారు. బాపట్ల పార్లమెంటు TNSF కార్యనిర్వాహక కార్యదర్శి అంకం తేజస్విని మాట్లాడుతూ తోటి ఆడపడుచుకు జరిగిన అన్యాయంపై కడుపు మండి ప్రశ్నించిన ఆడబిడ్డల ఇళ్లపైకి పోలీసులను పంపి వేధిస్తున్నారని అన్నారు.

జె.పంగులూరు మండలం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు కె.పద్మ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గు చేటన అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా కౌన్సిలర్లు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నోముల మృతి రంగినేని దిగ్ర్భాంతి

Sub Editor

పానగల్ మండలంలో స్వీట్లు పంచిన కాంగ్రెస్ యూత్

Satyam NEWS

కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ మంత్రివర్గం

Satyam NEWS

Leave a Comment