37.2 C
Hyderabad
March 29, 2024 17: 38 PM
Slider ప్రత్యేకం

టిఆర్ఎస్ ను గెలిపిస్తే కేసీఆర్ అహంకారం ఇంకా పెరుగుతుంది

#Bandisainjai

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని కాకుండా టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అహంకారం ఆకాశాన్ని అందుకుంటుందని ఫామ్ హౌస్ వదిలి కూడా బయటకు రాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాగర్ కర్నూల్ వెళ్తున్నా బండి సంజయ్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో అనారోగ్యంతో బాధ పడుతున్న జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ ను పరామర్శించారు.

అనంతరం శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి రామచంద్రరావుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్క భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వాఖ్యలు తమకు ఓటు వేయని వారిని దేవుడు క్షమించడు వారిని దేవుడే శిక్షిస్తాడు అన్న మాటలకు ఆయన మండిపడ్డారు.

బెదిరించి ఓట్లు అడిగితే  ఎవరు ఓటు వేయరని, ఆయన బెదిరిస్తే ఎవరు భయపడరని పేర్కొన్నారు. ఎవరు ఏం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని, ఎవరి సంగతి ఏంటి అనేది అందరికీ తెలుసని చుట్టాలకు బావలకు బావమరదుల కు అక్కలకు పెంచుకున్న వాళ్లకోసం పదవుల కోసం జీవోలు ఎవరు చేశారో ఉపాధ్యాయులకు అందరికీ తెలుసు అని సెటైర్లు వేశారు.

టిఆర్ఎస్ పార్టీ జిమ్మిక్కులు ఏమీ పని చేయవని అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు. వారి పార్టీలో ఉద్యమకారులకు కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వరనారు. వారి పార్టీ ఎజెండా కుటుంబ పాలన అని తెలిపారు.

వారి పార్టీ లో అభ్యర్థులు కరువయ్యారని ఆయన అన్నారు. గెలిచే ధైర్యం లేక గెలవమని చెప్పి పూర్తిగా అవగాహనకు వచ్చి నేడు పీవీ నరసింహారావు చిత్రపటాన్ని పెట్టుకొని జిమ్మిక్కులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనేది అదేవిధంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ నాయకుడా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందా అనేది కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇన్ని సంవత్సరాలు గుర్తుకురాని పీవీ నరసింహారావు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణ ఉద్యమంలో అంత గొప్ప వ్యక్తిని అవమానపరిచింది ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్రపటాలు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగడం పై పెద్ద చర్చ జరుగుతుందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ ని గెలిపించి కచ్చితంగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కుటుంబ పాలనకు అవినీతి అక్రమ పాలనకు అంతం వచ్చే రోజులు ఉన్నాయని భవిష్యం తెలిపారు. దుబ్బాక లో పేద ప్రజలు అంతా మేధావులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పరేడ్ గ్రౌండ్ లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

రైతులు ఆర్ధికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

Bhavani

రైతుల భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ పూర్తి మ‌ద్ధ‌తు

Sub Editor

Leave a Comment