28.7 C
Hyderabad
April 20, 2024 09: 20 AM
Slider ఆదిలాబాద్

స్టూడెంట్స్ కు బ్లూ ఫిల్మ్ చూపించిన టీచర్

#Teacher

ఆదిలాబాద్​ జిల్లాలోని తాంసి మండలం ఘోట్కూరి జడ్పీఎస్​ఎస్​ హైస్కూల్​లో  ఇంగ్లీష్​ స్కూల్​ అసిస్టెంట్​గా  పనిచేస్తున్న ఖదీర్​ అనే టీచర్​ను  గ్రామస్థులు స్కూల్లోనే నిర్బంధించడం తీవ్ర కలకలం రేపింది. 

సదరు టీచర్​  గత కొంత కాలంగా గర్ల్స్​ స్టూడెంట్స్​కు  సెల్​ ఫోన్​లో  బ్లూ ఫిల్మ్ చూపిస్తp వేధిస్తున్నట్లుగా  బాధిత స్టూడెంట్స్​  తమ తల్లిదండ్రులకు  తెలిపారు. దీంతో ఆగ్రహించిన పేరేంట్స్​,  గ్రామస్థులు స్కూల్​కు  చేరుకుని సదరు టీచర్​ను  ఓ గదిలో  బంధించి ఆందోళనకు దిగారు.

విద్యాబుద్దులు నేర్పిస్తు  స్టూడెంట్స్​ను  సత్ప్రవర్తనతో  మెలిగిలా తీర్చిదిద్దాల్సిన టీచర్​  వారిని పెడతోవ  పట్టించేలా వ్యవహరిస్తున్నారంటూ  మండిపడ్డారు.  ఇలాంటి టీచర్​ ఉంటే  తమ  పిల్లలను స్కూల్​కు ఎలా పంపించాలని హెచ్​ఎంతో  వాదనకు దిగారు. 

దీనిపై సమాచారమందుకున్న ఆదిలాబాద్​  రూరల్​ సీఐ పురుషోత్తం చారీ,  ఎస్సై  శిరీష,  విద్యాశాఖ  సెక్టోరియల్​ ఆఫీసర్లు  కంటె నర్సయ్య, ఉదయశ్రీ,  కంది శ్రీనివాస్​ రెడ్డిలు  స్కూల్​కు చేరుకుని విచారించారు.  స్టూడెంట్స్​, పేరేంట్స్​,  సదరు టీచర్​తో   మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

స్థానిక హెచ్​ఎం రిపోర్టు ఆధారంగా టీచర్ ఖదీర్ ను  డ్యూటీ నుంచి సస్సెండ్ చేస్తు డీఈఓ  ఎ.రవీందర్​ రెడ్డి  ఉత్తర్వులు జారీ చేసారు. 

ఇదే  మండల ఎంఈఓ ఇటీవల మందు తాగుతూ, పేకాట ఆడుతూ  సస్సెండ్​ కాగా  తాజాగా  ఓ టీచర్​ బ్లూ ఫిల్మ్​  వ్యవహారంలో  సస్సెండ్​ కావడంతో  మండలంలోని  గవర్నమెంట్​ స్కూల్లలో అసలుం ఏం జరుగుతుందనే  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఉన్నాతాధికారుల పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతుందనే  విమర్శలు విన్పిస్తున్నాయి.

Related posts

15-18 వయసు కలిగిన టీనేజీ పిల్లలు తప్పకుండా టికాలు వేసుకోవాలి

Satyam NEWS

‘జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరాం’

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ పేరుతో ఎమ్మెల్యేలు భూములు లాక్కుంటున్నారు

Satyam NEWS

Leave a Comment