27.7 C
Hyderabad
April 25, 2024 07: 53 AM
Slider శ్రీకాకుళం

పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ మోహన్

#srikakulamdist

ప్రభుత్వ మహిళా ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన ఒక పేద విద్యార్ధికి పుస్తకాల కోసం ఐదు వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని శ్రీకాకుళం గ్రామీణ మండలం పెదపాడు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ గుండబాల మోహన్ అందచేశారు. పెదపాడు గ్రామానికి చెందిన జలుమూరు ఝాన్సీ మెరిట్ స్టూడెంట్. అయితే పేదరికం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.

జలుమూరు ఝాన్సీ తమ పాఠశాలలో చదివిన సమయంలో జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ పొందిందని బాలమోహన్ తెలిపారు. అంతే కాకుండా క్రీడల్లో కూడా చురుకైన విద్యార్థిగా పేరు పొందిందని ఆయన తెలిపారు. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఇటీవలే మృతి చెందారు. తల్లి కూలి పని చేస్తుండడంతో కుటుంబ పోషణ కష్టతరమవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యాయామ ఉపాధ్యాయ డాక్టర్ మోహన్ ఆమె చదువుల కోసం పూర్తి సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.

శ్రీకాకుళం  జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ గౌరవ అధ్యక్షులు పి.సుందర్ రావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎన్.వి.రమణ, పి. సాంబమూర్తి, బి. రమణ, రాజారావు, మాధవరావు, ఎం.ఎస్సీ శేఖర్, వై .పోలినాయుడు, సతీష్. రాయుడు, నిర్మల కృష్ణ, బి. నారాయణ, సమగ్ర శిక్ష వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎల్. ఢిల్లీశ్వరరావు, సిహెచ్.  శ్రీనివాస్, వై. రామారావు, అప్పలరాజు, సిహెచ్. రాజేశ్వరి, బి. రమేష్ తదితరులు ఈ మంచి కార్యక్రమాన్ని అభినందించారు.

Related posts

అచ్చుల వందనం

Satyam NEWS

శాఖా సిబ్బంది ఆరోగ్యంపై పోలీసు బాస్ ప్రత్యేక శ్రధ్ధ..!

Bhavani

శ్రమ దోపిడీకి పరాకాష్ట -తెలంగాణ ప్రభుత్వ దుశ్చర్య

Satyam NEWS

Leave a Comment