37.2 C
Hyderabad
April 19, 2024 11: 50 AM
Slider ముఖ్యంశాలు

పాఠాలు చెప్పిన పెద్దసారుకు చిరుచేతుల సాయం

#old students

తమకు పాఠాలు  చెప్పిన ఉపాధ్యాయుడి కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు  శ్రీ సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు మండలం మల్లంపల్లి గ్రామామనికి చెందిన శ్రీ సిద్దార్థ  పాఠశాలప్రధానోపాధ్యాయుడు మియాపురం రమేష్ బాబు  ఈనెల 7 వ తేదీన కరోనాతో మృతి చెందారు. తమకు పాఠాలు చెప్పిన ప్రధానోపాధ్యాయుడు మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి  అదే పాఠశాలలో చదువుకున్న  పాఠశాలలో 2005-2006  బ్యాచ్ పదోతరగతి  విద్యార్థులు ఉపాధ్యాయుడి రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఆయన సతీమణి జోత్యికి 25000 వేల రూపాయల చెక్కును, 25 కేజిల బియ్యాన్ని అందజేసి  మానవత్వాన్ని చాటుకున్నారు. విషయం తెలుసుకున్న పలువురు   విద్యార్థులను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుడుతాల శ్రీకాంత్, కoదగట్ల ప్రదీప్, రాజు, నన్నేపోయిన సురేష్, శివాజి, పెంట రఘు తదితరులు ఉన్నారు.

Related posts

కరోనా తో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి

Satyam NEWS

భాష్యం మోడల్ స్కూల్ వారి “చంద్రయాన్ 3 విజయోత్సవ” ర్యాలీ

Satyam NEWS

ఎలుకలు, కుక్కలను పట్టుకోవడం వైద్యుల పనా?

Satyam NEWS

Leave a Comment