35.2 C
Hyderabad
April 24, 2024 12: 28 PM
Slider శ్రీకాకుళం

అధికార భాషా సంఘం అధ్యక్షుడిని కలిసిన రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం

#yarlagadda

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ను రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు పిసిని వసంతరావు,  సంయుక్త కార్యదర్శి గొడబ మేరీ ప్రసాద్ కలిశారు. జిల్లాలో భాషోపాధ్యాయులు  ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతీకరణ పదోన్నతులలో స్థానాలు కోల్పోయి, డీఈవో పూల్ లో సర్దుబాటుకు గురైన 1137 మంది బాషాపండితులకు సూపర్ న్యూమరరీ స్కూల్ అసిస్టెంట్(భాషలు) పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని కోరారు.

శ్రీకాకుళం జిల్లాలో  కోర్టు ఉత్తర్వుల ద్వారా జులై,2019లో నియమితులైన 39 మంది డీఎస్సీ-2002 బాధిత హిందీ పండితులకు ఇప్పటి వరకూ జీతాలు చెల్లించలేదని, వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయని తెలిపారు. వారికి జీతాల చెల్లింపు ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం హిందీ ఉపాద్యాయులపై తీవ్రమైన బోధనా భారాన్నీ నెట్టారని, మాధ్యమాల వారీగా స్టాఫ్ పాటర్న్ రూపొందించి గుణాత్మక విద్యకు సహకరించాలని కోరారు.

అధికార భాషా చట్టం పర్యవేక్షణకు భాషోపాధ్యాయు లతో కూడిన మండల, జిల్లా పర్యవేక్షణ అధికారులను నియమించాలని విన్నవించారు. ఇటీవల విడుదలవుతున్న తెలుగు చలన చిత్రాల గోడపత్రికల్లో శీర్షికలు ఆంగ్లంలో వేస్తున్నారని, ఇది తెలుగు భాషకు ద్రోహం చేసేలా ఉందని పేర్కొన్నారు..వీటిపై సంబంధిత శాఖలతో చర్చించి తెలుగులోనే శీర్షికలు అచ్చువేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలపై సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు తీసుకొనేలా ప్రాతినిధ్యం చేస్తానని యార్లగడ్డ అన్నారు.

Related posts

గౌడ్ లు రాజ్యాధికారం దిశగా కృషి చేయాలి

Satyam NEWS

మారిన వాతావరణం.. ఎండకు బదులు వాన..ఎక్కడంటే…?

Satyam NEWS

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Satyam NEWS

Leave a Comment