34.2 C
Hyderabad
April 19, 2024 19: 05 PM
Slider హైదరాబాద్

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదే

#uppal

సుద్దులన్ని మనకు అద్దినట్లు చెప్పే గురువులను సత్కరించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.

కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి  శశిధర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభలో చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్ల కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి లతో కలిసి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

కాప్రా మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 29 మంది  ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికను అందించి శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, రాజకీయ నాయకులుగా, మేధావులుగా, డాక్టర్లుగా, సైంటిస్టులు గా, దేశ సరిహద్దుల వద్ద కంటికి రెప్పలా కాపాడే జవాన్లను తయారుచేసే గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయుల పని ఉందని అన్నారు.

చిన్నారులకు మొదటి గురువు తల్లిదండ్రులు అయితే పాఠశాలలో విద్యార్ధులకు దేశ సార్వభౌమత్వాన్ని ప్ర బోధించే గురువులు మన ఉపాధ్యాయులని సభికుల హర్షధ్వానాల మధ్యన సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు.

అలాంటి గురువులు మన  పిల్లలు పాఠశాలలో కానీ బయట సమాజం లో గాని తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసిన సమయంలో సరిదిద్దడానికి చేసే ప్రయత్నాలను తప్పు పడుతుండడం దురదృష్టకరమని పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అనంతరం విధినిర్వహణలో  తమ శిష్యులు సాధించిన ఫలితాలను గుర్తు చేసుకుంటూ ఆత్మ సంతృప్తి పొందుతూ శేష జీవితం ప్రశాంతంగా గడపాలన్న ఆశాభావాన్ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి డి పి ఆర్ టి యు మేడ్చల్ జిల్లా కార్యదర్శి  శ్రీధర్, పిఆర్టియు మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పి ఆర్ టి యు కాప్రా మండల అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణ, మల్లేశం, యుటిఎఫ్ నాయకులు లక్ష్మీనారాయణ, గణేష్, విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి, కర్రే సత్యనారాయణ, రజిత, నిర్మల, కాసుల సురేష్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆద‌ర్శ‌వంతంగా 111 డివిజ‌న్‌ను తీర్చి దిద్దుతా

Sub Editor

పాలిట్రిక్స్: తెలంగాణ సిఎంకు ఆంధ్రా ఎంపి కితాబు

Satyam NEWS

యువకుడి ఆకలి తీర్చిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment