39.2 C
Hyderabad
April 16, 2024 18: 54 PM
Slider శ్రీకాకుళం

ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

FAFPTOSrikakulam

తక్షణమే ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలు విడుదల చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రారంభమైన ఫ్యాప్టో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 53, 54 లో ఉన్న వైరుధ్యాలను ఫ్యాప్టోతో చర్చించి సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలు విడుదల చేయడమే కాక ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అయిదు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫ్యాప్టో రాష్ట్ర కోచైర్మన్ కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ విద్యారంగం మీద అత్యంత శ్రద్ధ కన పరుస్తున్న ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పైన డిమాండ్లను పరిష్కారం లో తాత్సారం చేయడం సమంజసం కాదన్నారు.

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధ్యాయ విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఫ్యాప్టో సంఘాల నాయకులను పిలిచి మాట్లాడడానికి ప్రభుత్వం పట్టుదలకు పోవడం సరికాదన్నారు.

ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు  మజ్జి మదన్ మోహన్ మాట్లాడుతూ ఫ్యాప్టో రిలే నిరాహార దీక్షలు నోటీసు ఇచ్చిన తరువాత ఫ్యాప్టో సంఘాలను పిలవకుండా అస్పష్టమైన ఉత్తర్వులను విడుదల చేయడం సరికాదన్నారు.

ఏపీటీఎఫ్ 257 నిర్వహణలో జరిగిన ఈ రోజు నిరాహార దీక్ష శిబిరంలో ఎస్ టి యు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస పట్నాయక్, ఏపీటీఎఫ్ (1938) జనరల్ సెక్రటరీ టెంక చలపతి రావు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సెన్సార్ కార్యక్రమాల్లో 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS

మానవత్వంలేని మమ్ములను క్షమించు ఫరీదా

Satyam NEWS

ములుగు జిల్లా మేరు సంఘం కమిటీ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment