37.2 C
Hyderabad
April 19, 2024 11: 20 AM
Slider హైదరాబాద్

ముగిసిన వారం రోజుల ఏఐసిటిఈ – ఐడియా అధ్యాపకుల శిక్షణ

#workshop

సి బి ఐ టి కళాశాలలో జరుగుతున్న వారం రోజుల ఏఐసిటిఈ – ఐడియా అధ్యాపకుల శిక్షణ కార్యక్రమం ఈ రోజు తో ముగిసింది. ప్రారంభ వేడుక 24 ఏప్రిల్ 2023న నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎల్. శివరామకృష్ణ “ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కోసం డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్” అనే అంశంపై ఉపన్యాసాన్ని అందించారు.  “డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఇట్స్ ఇండస్ట్రీ అప్లికేషన్స్” అనే అంశంపై డాక్టర్ జి. చంద్రమోహన్ రెడ్డి అతిథి ఉపన్యాసం ఇవ్వడంతో 2వ రోజు కూడా అంతే ఉత్సాహంగా సాగింది.

సిబిఐటి  ఏఐసిటిఈ – ఐడియా ల్యాబ్ సాంకేతిక సలహాదారు డాక్టర్ ఉమాకాంత చౌదరి, “ప్రోటోటైపింగ్ మరియు టెక్నాలజీ సంసిద్ధత” అనే అంశంపై ప్రసంగించారు. 3వ రోజు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్న రామ్‌టెక్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి జపాన్ మరియు జర్మనీ నుండి 5-యాక్సిస్, 7-యాక్సిస్ టర్న్ మిల్లుల గురించి తెలుసుకున్నారు. 4వ రోజు అంతా ఐ ఓ టి, దాని అప్లికేషన్‌ల గురించి, డాక్టర్ ఎమ్ శ్యామ్ సుందర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంపై అతిథి ఉపన్యాసాన్ని అందించారు. చివరి రోజు నోడ్ ఎమ్ సియూ, దాని అప్లికేషన్‌ల స్థూలదృష్టిపై డా. డి  కృష్ణమోహన్ అతిథి ఉపన్యాసం అందించారు.

ముగింపు కార్యక్రమంలో  సిబిఐటి (బ్యాచ్ 1992) పూర్వ విద్యార్థి సీతారాం గెడ్డం ముఖ్యఅతిథిగా హాజరై  బహుళ డిజైనింగ్ అంశాల గురించి తెలుసుకోవడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఐ ఓ టి  ఇంటర్‌ఫేసింగ్‌తో వివిధ పరికరాలు తయారీ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.పి.రవీందర్ రెడ్డి, సాంకేతిక సలహాదారు డా.ఉమాకాంత చౌదరి, డా.పి.ప్రభాకర్ రెడ్డి (హెచ్‌ఓడీ ఎంఈడీ), డా.డి.కృష్ణారెడ్డి (హెచ్‌ఓడీ ఈసీఈ) తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యశాలకు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ బి వి ఎస్. రావు, డాక్టర్ పి  సతీష్ సమన్వయకర్తలు గా వున్నారు.

Related posts

వనపర్తిలో కర్నూలు హెల్త్ కేర్ క్లినిక్ సీజ్

Satyam NEWS

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు

Satyam NEWS

ఉద్యమ నాయకులను బూటు కాళ్లతో తన్నిస్తుంటే ఎలా రావాలి?

Satyam NEWS

Leave a Comment