30.2 C
Hyderabad
February 9, 2025 20: 49 PM
Slider ప్రత్యేకం

దుష్ప్రచారంపై గరికపాటి టీమ్ సీరియస్

#garikapati

ప్రముఖ ప్రవచన కర్త, ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావుపై కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆపకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని గరికపాటి టీమ్ హెచ్చరించింది. గరికపాటి నరసింహారావు ప్రసంగాలను నిత్యం ఎన్నో లక్షల మంది యూట్యూబ్​లో వీక్షిస్తుంటారు. వ్యంగ్యం, హాస్యం జోడిస్తూ కొనసాగే ఆయన వ్యాఖ్యానం అంటే ఎంతో మందికి అభిమానం. ఎంతో మంది ప్రేరణ పొందుతారు కూడా. అయితే, ఇటీవల సామాజిక మాధ్యమాల్లో గరికపాటిపై జరుగుతన్నదంతా తప్పుడు ప్రచారం అని తాజాగా ఆయన టీమ్‌ స్పందించింది.

ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతోందని వెల్లడించింది. మేరకు గరికపాటి సోషల్‌ మీడియా అకౌంట్​లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో పరువు తీస్తున్నారని తెలిపారు. గరికపాటిపై వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్యదూరమని పేర్కొన్నారు. వేర్వేరు సందర్భాల్లో ఎవరెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటూ ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం జరుగుతోందని వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్‌ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్‌, పరువు నష్టం కేసులు వేస్తామని గరికపాటి టీం హెచ్చరించింది. ఇకపై అలాంటి దుష్ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Related posts

ఇల్లీగల్: నది మనదే ఇసుక తోడుకో డబ్బు దోచుకో

Satyam NEWS

శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్న కె.రాఘవేంద్రరావు

Satyam NEWS

నరసరావుపేట లో పర్యటించిన సినీ నటుడు శివాజీ

Satyam NEWS

Leave a Comment