Slider క్రీడలు

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 గెలిచిన టీమ్ ఇండియా

ఉత్కంఠ భరిత పొరులో భారత్ జట్టు జయకేతనం ఎగుర వేసింది. అఖండమైన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ -2025 గెలిచిన టీమ్ ఇండియా కు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫైనల్ మ్యాచ్ లో కివీస్ పై భారత జట్టు విజయం దేశం గర్వించదగ్గ విషయం. టీమ్ ఇండియా సమిష్టి పోరాట పటిమ, జట్టు సభ్యులు కనబరిచిన ప్రతిభ ఆదర్శం. బౌలింగ్, బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి విజయం సాధించిన జట్టు సభ్యులకు అభినందనలు. దుబాయ్ లో జరిగిన చాంపియన్ ట్రోఫీ క్రికెట్ -2025 విజేతగా ఇండియా టీమ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆధ్యాంతం వీక్షకులను అలరించింది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి ఇండియా కీర్తిని ప్రపంచ దేశాలకు మరోసారి చాటి చెప్పారు. ఇండియా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నది. ట్రోఫీ గెలుపుతో ఇండియాలో సంబరాలు మిన్నంటాయి. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక్క జియో హాట్ స్టార్ చానల్లో 83.7కోట్ల మంది వీక్షించినట్లు వెల్లడించారు.

Related posts

అంబేడ్కర్ విగ్రహాన్ని తరలించాలనే కుట్రను విరమించుకోవాలి

Satyam NEWS

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

mamatha

శ్రీశ్రీ శ్రీ పైడితల్లి పండుగ లో ట్రాఫిక్ నిర్వహణ సమర్ధవంతం…!

Satyam NEWS

Leave a Comment