27.7 C
Hyderabad
April 25, 2024 10: 14 AM
Slider ఆదిలాబాద్

సైబర్ నేరాలను కట్టడి చేయడానికి నూతన ఎస్సైలు సమాయత్తం

#adilabad police

అనూహ్యంగా పెరుగుతున్న సైబర్ నేరాలకు కళ్లెం వేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రధాన దృష్టి సారించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఇన్చార్జిగా వ్యవహరించిన శిక్షణ ఎస్సైలకు నెల రోజులు పూర్తయిన నేపథ్యంలో బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో 19 మంది శిక్షణ ఎస్ఐలతో ఎస్పీ సమావేశమైనారు,ఆయా పోలీస్ స్టేషన్ల సంబంధిత సర్కిల్ కార్యాలయంలోనే నెలరోజులపాటు సీఐ పర్యవేక్షణలో విధులు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేశారు,

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నెల రోజుల ఇన్చార్జ్ అనుభవము ఒక్కొక్కరిని వివరంగా అడిగి తెలుసుకున్నారు, ఒక మండలానికి బాధ్యతగా వ్యవహరించడం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకోని, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు చేపట్టడం నూతన అనుభూతిని కల్పించిందని శిక్షణ ఎస్ఐలు వివరించారు, ప్రతిరోజూ అనూహ్యంగా జరిగే పరిణామాలతో సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుందని, కిష్టమైన సందర్భంలో న్యాయం చేయడానికి సర్వశక్తులు కృషి చేసినట్లు తెలిపారు, ప్రజలతో మమేకంగా ఉండి, వారి సమస్యలను పరిష్కరించిన అనంతరం ప్రజల స్పందన అనుభూతిని ఆస్వాదించామని తెలిపారు,

నేరాలను కట్టడి చేసి ప్రజలతో మరింత స్నేహసంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఆలోచన ప్రణాళికలు మదిలో ఉన్నాయని శిక్షణ ఎస్సైలు ఎస్పీకి వివరించారు, ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలను కట్టడి చేసే అతి పెద్ద సవాలు పోలీస్ శాఖ ముందు ఉన్నదని తెలిపారు, రాష్ట్రస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు సైబర్ నేరాలను కట్టడి చేయడానికి మూడంచెల వ్యూహం అమలు చేసే విధంగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు, క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి, ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు చొప్పున సైబర్ వారియర్లను నియమించినట్లు తెలిపారు,

సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 155260 ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాలని తెలిపారు, ప్రజల్లో మరింత అవగాహన కల్పించి సైబర్ నేరాలకు గురికాకుండా చూసే బాధ్యత ఎస్సైలపై ఉందన్నారు, వినియోగదారుల సేవా కేంద్రం వారు ఎప్పుడూ ఫోన్లలో ఖాతాల వివరాలు, పిన్, ఓటిపి నెంబర్లు అడగరని, ప్రతి ఒక్కరు గుర్తించుకునే ప్రధాన అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని తెలిపారు,

గుర్తుతెలియని వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేయకూడదని, ఇది చాలా ప్రమాదకరమనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు, గూగుల్ సెర్చ్ ఆప్షన్ లో కనిపించే నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల ద్వారానే అధిక మోసాలు జరుగుతున్నాయని తెలిపారు, ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ జి. మల్లేష్, ఎస్సై సయ్యద్ అన్వర్ ఉల్ హక్, క్యాంపు కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్, 19 మంది శిక్షణ ఎస్ఐలు పాల్గొన్నారు.

Related posts

ట్రంప్ టూర్:సబర్మతీ ఆశ్రమంలోబాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Satyam NEWS

రాయపూర్ లో కాంగ్రెస్ ప్లీనరీ

Murali Krishna

బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడితో రహ్మతుల్లా భేటీ

Satyam NEWS

Leave a Comment