30.2 C
Hyderabad
September 14, 2024 16: 14 PM
Slider తెలంగాణ

ప్రచారంలో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న

mallanna

తీన్మార్ మల్లన్న  హుజూర్ నగర్ ఉపఎన్నికలల్లో ఇండిపేంట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన బలమైన నినాదంతో ఎన్నికల బరిలోకి వెళ్లారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు ఆయనకు సపోర్టు ఇస్తున్నారు. అగ్ర కులాలకు చెందిన దొరలు, బడా బాబులు చాలా కాలం కిందటే  గ్రామాలను వదిలి వెళ్ళి సిటీలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు రైతు బంధు పథకంతో గ్రామాలకు మళ్లీ చేరుకొని భూములను సాగుచేసుకుంటున్నట్టు నాటకాలు ఆడుతున్నారు. మళ్ళీ కొత్త భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటు లక్షల ఏకరాలను దోచుకు కుంటున్న వైనాన్ని ఆధారాలతో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తీన్మార్ మల్లన్న  తెలియ చేస్తున్నారు.

అందుకే పాత రికార్డు లను తగుల పెట్టడానికి సీఎం కేసీఆర్ సచివాలయానికి కూల్చే పనిలో పడ్డారని ఆయన అక్కడ కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. రాష్ట ప్రజలకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని తెలియచేస్తున్నారు. దీనికి ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్న ఓటింగ్ శాతంలో ఇప్పటికే 40శాతం ఆయనకే అనుకూలంగా ఉందని సర్వేలు చెపుతున్నాయి. అందుకే అక్కడ తీన్మార్ మల్లన్నను, వర్గాన్ని ప్రచార వాహనాలను అధికారంతో అడ్డుకుంటున్నారని  ఆయన ఆరోపిస్తువస్తున్నారు.

టిఆర్ఎస్,  కాంగ్రెస్, బీజేపీ పార్టీ అగ్ర నాయకులు తీన్మార్ మల్లన్నను ఎదుర్కోలేక అడ్డంకులు కలిగిస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఎవ్వరు ఇబ్బందులు పెట్టినా ఆయన మాత్రం తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్టంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏ పార్టీ నుంచి ఎవ్వరు గెలిచినా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. అదే తీన్మార్ మల్లన్న విజయం సాధిస్తే ప్రజల సమస్యను అసెంబ్లీలో వినిపించే గొంతుకగా మారతారని ఆయన మద్దతుదారులు చెపుతున్నారు.

ఆర్టీసీ సమ్మె  తీవ్రతరం కావడంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ట్రాన్స్ పోర్ట్ సమస్యతో సతమతం అవుతున్నారు. ఇది తీన్మార్ మల్లన్న ప్రచారంలో ఒక భాగం అయింది. ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య కు ముఖ్యమంత్రి కారకుడని కూడా మల్లన్న ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రచారం ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నది. తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపిస్తే గులాబీ ప్రభుత్వ అధినేతకు కంటికి కునుకు లేకుండా చేస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

అవుట రాజశేఖర్ జర్నలిస్ట్ కొల్లాపూర్

Related posts

అమరావతి రైతుల పాదయాత్రపై హోం మంత్రి విమర్శలు

Satyam NEWS

అమ్మ

Satyam NEWS

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకలు

Satyam NEWS

Leave a Comment